హీరోయిన్, పాటలు లేకుండా 100 కోట్లు కొట్టిన హీరో కార్తీ మాత్రమే..!

కార్తి.. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో. సూర్య తమ్ముడు గా మనకి పరిచయం అయినప్పటికీ విభిన్న కథలు ఎంచుకుంటూ తన నేచురల్ యాక్టింగ్ తో రంజింపజేసే హీరో అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈయన ఎక్కువగా కొత్త డైరెక్టర్లకే అవకాశాలు ఇస్తూ ఉంటాడు అని అందరూ చెబుతుంటారు. కానీ టాలెంట్ ఉన్న డైరెక్టర్లకి అవకాశం ఇస్తుంటాడని తరువాత అర్థమవుతుంటుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్.. ఆయన ఇటీవల చేసిన ‘ఖైథి’ చిత్రం.

ఈ సినిమాలో హీరోయిన్ ఉండదు, పాటలు ఉండవు. అయినా బ్లాక్ బస్టర్ కొట్టింది ఈ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూల్ చేసి కార్తీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు హీరో కార్తికి కూడా ఇదే మొదటి 100 కోట్ల సినిమా. విడుదలై 3 వారాలు పూర్తిచేసుకుంటున్నప్పటికీ ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్స్ ను సాధిస్తుండడం విశేషం. తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఈ చిత్రం వసూళ్ళు ఇప్పటికీ స్టడీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని కచ్చితంగా ఓ ‘గేమ్ చేంజర్’ మూవీ అని చెప్పుకోవచ్చు..!

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus