అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ అదిరింది

పవర్ స్టార్ అభిమానులు ఉదయం నుంచి తిండి, తిప్పలు పక్కనెట్టి ఎప్పుడు పదవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ.. అభిమానుల ఆకాంక్షను ఉపేక్షించని పవన్ కళ్యాణ్ మాత్రం 10కి కాక తీరిగ్గా 12.40కి తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు. అప్పటికే ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూసి చూసి ఉన్న అభిమానులందరూ ఒక్కసారిగా ఫస్ట్ లుక్ రిలీజవ్వడంతో ఎక్కడలేని ఆనందంతో ఉక్కిరిబిక్కియారిపోయారు. సూపర్ స్టైలిష్ గా సోఫాలో కూర్చుని, ఐడెంటిటీ కార్డ్ ను గాల్లో తిప్పుతున్న పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించగానే అప్పటివరకూ వెయిట్ చేసినందువల్ల కలిగిన బాధ మొత్తాన్ని మర్చిపోయారు.

అయితే.. ఓవరాల్ గా ఇటీవలకాలంలో వచ్చిన ఫస్ట్ లుక్స్ లో “అజ్ణాతవాసి” ది బెస్ట్ అని చెప్పుకోవాలి. పోలోమని గ్రాఫిక్స్, కాన్సెప్ట్ కోసమని బ్యాగ్రౌండ్ లో చిత్రవిచిత్రమైన పార్టికల్స్ లేదా మ్యాపులను చేర్చకుండా సింపుల్ గా కళ్యాణ్ కూర్చున్న పోస్టర్ ను రిలీజ్ చేయడంలో సినిమా కూడా సింపుల్ గా ఎంటర్ టైన్ చేస్తుందని త్రివిక్రమ్ చెప్పకనే చెబుతున్నాడు. అలాగే.. ట్యాగ్ లైన్ “కింగ్ ఇన్ ఎగ్జైల్” అని పెట్టడం టైటిల్ కి సరిగ్గా యాప్ట్ అయ్యింది. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తిసురేష్, అను ఎమ్మాన్యూల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతుండగా.. ఈ సినిమా కోసం కీర్తిసురేష్ స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. డిసెంబర్ రెండోవారంలో అనిరుధ్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను విడుదల చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus