శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ ఫస్ట్ లుక్ విడుదల

బుల్లితెర రాములమ్మ, ప్రముఖ యాంకర్, ‘బిగ్ బాస్ 3’ ఫేమ్ శ్రీముఖి ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’. గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎయిన్స్ మోషన్ పిక్చర్స్, కాక్ టైల్ సినిమాస్ పతాకంపై అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్ నిర్మించారు. ఆదివారం (మే 10) శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత గౌతమ్ ఇ.వి.ఎస్ మాట్లాడుతూ “ఇదొక సైబర్ క్రైమ్ థ్రిల్లర్. నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ప్రస్తుత సమాజంలో యువతరం జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది. సినిమాలో శ్రీముఖి గారు ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం లేదు. కానీ, ఆమెది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి పాత్రలో శ్రీముఖి నటించలేదు. ఆమె అభిమానులకు, ప్రేక్షకులకు ఈ క్యారెక్టర్ సర్ ప్రైజ్ ఇస్తుంది. పాత్రలో ఆవిడ అద్భుతంగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి” అని అన్నారు.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus