కొన్ని సినిమాల అనౌన్స్‌మెంట్ అవ్వకుండానే చాలా పనులు పూర్తి చేసుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో అల్లు అర్జున్ (Allu Arjun) – అట్లీ (Atlee Kumar) సినిమా కూడా ఉంది అని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా మరో రూమర్ బయటకు వచ్చింది. అదే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారట. అందులో ప్రధాన కథానాయికగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుందని సమాచారం. అల్లు అర్జున్ – అట్లీ కలయికలో సినిమా ఇప్పట్లో కష్టమే అని తొలుత వార్తలొచ్చాయి.
దానికి కారణం సల్మాన్ ఖాన్ సినిమాతో అట్లీ బిజీగా ఉండటమే అనే వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా మెటీరియలైజ్ అవ్వకపోతుండటంతో తొలుత బన్నీ సినిమా చేసేద్దాం అని అట్లీ అనుకున్నారట. మరోవైపు బన్నీ ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule) తర్వాత ఫ్రీ అవ్వడంతో ఈ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయిందట. త్రివిక్రమ్ (Trivikram) సినిమా లైనప్‌లో ఉన్నా.. కథ రెడీ కాలేదట. ఆ విషయం పక్కన పెడితే అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సరసన ఐదుగురు నాయికలు నటించనున్నట్టు తెలుస్తోంది.
ఇందులో విదేశీ కథానాయికలు కూడా ఉంటారట. దీని కోసం చిత్రబృందం ఎంపిక ప్రక్రియని మొదలు పెట్టినట్టు సమాచారం. త్వరలోనే విదేశీ భామలు ఇద్దరిని ఫిక్స్ చేస్తారట. ఆ తర్వాత మన దేశంలో మరో ఇద్దరు నాయికల్ని ఓకే చేస్తారని సమాచారం. ఇక అల్లు అర్జున్ ఈ సినిమా కోసమే విదేశాలకి వెళ్లి ప్రత్యేక శిక్షణని పూర్తి చేసుకుని ఇటీవలే తిరిగొచ్చారు.
‘జవాన్’ (Jawan) లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత.. దేశాన్ని షేక్ చేసిన ‘పుష్ప’ (Pushpa) సినిమాల తర్వాత అట్లీ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ‘AAA’ ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఎందుకంటే అట్లీ మాస్ ఎలిమెంట్స్‌తో సినిమా చేస్తే ఏ రేంజి విజయం అందుకుంటారో మనకు తెలుసు. ఇక బన్నీ సంగతి సరేసరి. మాస్ మూవీస్‌కి ఐకాన్ అయిపోయాడు.