Suresh Babu: స్టార్ ప్రొడ్యూసర్ కి ఏదీ కలిసి రావడం లేదు!

ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా చేయడమంటే అంత సులువైన విషయం కాదు. నిర్మాత రామానాయుడు గారు కథలు విని.. అది వర్కవుట్ అవుతుందో లేదో వెంటనే చెప్పేసేవారు. ఆయన లెక్క తప్పిన సందర్భాలు ఉన్నప్పటికి.. అది చాలా తక్కువ. ‘బొబ్బిలి రాజా’ నుంచి భారీ చిత్రాల నిర్మాణ బాధ్యతలు సురేష్ బాబు చేతికి వచ్చాయి. ఓ పక్క డిస్ట్రిబ్యూషన్ తో పాటు సినిమా నిర్మాణం కూడా దగ్గరుండి చూసుకునేవారు సురేష్ బాబు.

ఈ క్రమంలో ఎన్నో హిట్స్ అందుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సురేష్ బాబు లెక్క పూర్తిగా తప్పుతోంది. కథలను సరిగ్గా విని ఓకే చేస్తున్నారో లేదో కానీ ఈ బ్యానర్ లో వస్తోన్న సినిమాలేవీ కూడా వర్కవుట్ అవ్వడం లేదు. రీసెంట్ గా ఈ బ్యానర్ నుంచి విడుదలైన ‘ప్రిన్స్’ సినిమా ప్లాప్ దిశగా పరుగులు పెడుతోంది. తమిళంలో కూడా ఈ సినిమా మోస్తరుగా ఆడుతోంది. మొన్నామధ్య ‘శాకిని డాకిని’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ ఇలా చాలా సినిమాలు వచ్చాయి.

ఇవేవీ కూడా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయాయి. అంతకముందు విడుదలైన ‘విరాటపర్వం’ సినిమా సైతం థియేటర్లలో నడవలేదు. ఓటీటీకి అనుకున్న ఈ సినిమాను థియేటర్లో విడుదల చేసి కనీసపు ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయారు. ‘దృశ్యం2’ని మాత్రం ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను థియేటర్లో చూడాలని ఆశించారు ప్రేక్షకులు. ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన సినిమాలను థియేటర్లో.. థియేటర్లో రిలీజ్ చేయాల్సిన సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమాలేవీ కూడా సురేష్ బాబు సోలోగా ప్రొడ్యూస్ చేసినవి కావు. అయినప్పటికీ సురేష్ ప్రొడక్షన్స్ లోగో చూసినప్పుడు జనాలు ఆ బ్యానర్ సినిమా అనే అనుకుంటారు. ఫ్యూచర్ లో అయితే సురేష్ బాబు హిట్స్ అందుకునేలా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటారేమో చూడాలి!

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus