పల్లెల్లో.. పనిచేస్తూ పాడుకునే పాటలు మస్తుగుంటాయ్. అలాగే పండుగలలో తీన్మార్ వేసుకుంటూ ఆలపించే గేయాలకు చిన్నపిల్లలు సైతం కాలు కదపాల్సిందే. అటువంటి జానపద గేయాలు కమర్షియల్ హంగులు జోడించుకుంటే.. వెండితెరపై వినిపిస్తే.. మరింత బాగుంటాయి. అలాహిట్ అయిన జానపదగేయాలపై ఫోకస్..
1. గున్న గున్న మామిడి
ఈ మధ్య ఏ వేడుకయినా గున్న గున్న మామిడి సాంగ్ ప్లే చేయకుండా ముగింపు పలకడం లేదు. స్థానిక డీజేలు ఈ గేయానికి ఫాస్ట్ బీట్ జోడించి ముసలి వాళ్ళచేతకూడా స్టెప్పులు వేయించారు. ఈ పాటని మన మాస్ మహారాజ్ రవితేజ్.. తన రాజా ది గ్రేట్ మూవీలో పెట్టి హిట్ కొట్టారు.
2. కాటమరాయుడా…
రాయలసీమలో పుట్టిన కాటమరాయుడా.. కదిరి నరసింహుడా అనే జానపద గేయం.. అత్తారింటికి దారేదికి ముందే చాలామందికి తెలుసు. దానిని పవన్ కళ్యాణ్ పాడడంతో అందరికీ తెలిసింది. సూపర్ హిట్ అయింది.
3. పెద్ద పులి
తెలంగాణ సంస్కృతిలో భాగం “పెద్ద పులి” పాట. ఈ పాటని చల్ మోహన్ రంగ.. సినిమాలో నితిన్ సరికొత్త మ్యూజిక్ జోడించి అల్లాడించారు.
4. లాలూ దర్వాజా
మొండి మొగుడు పెంకి పెళ్ళాం సినిమాలో విజయశాంతి “లాలూ దర్వాజా” పాటకి బాగా డ్యాన్స్ చేసింది. ఇది బాగా పాపులర్ అయింది. ఈ పాట పాడిన శైలజకి మంచి గుర్తింపును తెచ్చింది. ఇది కూడా జానపద గేయంగా ఎప్పుడో ప్రజల మనసులను గెలుచుకుంది.
5. మాయదారి మైసమ్మ
బోనం ఎత్తితే మాయదారి మైసమ్మ పాట ప్లే కావాల్సిందే. ఎంతోమంది జానపదగాయకులు దీనిని ఆలపించారు. కాలేజీ సినిమాలో ఈ పాట ఉర్రూతలూగించింది.
6. నీలపోరి గాజుల
శ్రీకాంత్ నటించిన మహాత్మ మూవీ లో “నీలపోరి గాజుల” అనే పాట బాగా హిట్ అయింది. పాపులర్ అయిన జానపద గేయాల్లో ఇదికటి. వెండితెర పైనా కూడా మరింత ప్రజాధారణ అందుకుంది.
7. అత్తరు సాయిబో రారా
సరదాగా నవ్వులు పండించడానికి వీధి కళాకారులూ పాడుకునే ఈ జానపద గేయాన్ని రాజేంద్ర ప్రసాద్ ఆల్ రౌండర్ సినిమాలో వాడి మరింత పాపులర్ చేశారు.
8. కోడిపాయే లచ్చమ్మది
జానపద గేయాల పోటీలు ఎక్కడ జరిగినా తప్పకుండా వినిపించే పాట “కోడిపాయే లచ్చమ్మది”. ఈ గేయానికి సినీ సంగీతాన్ని జోడించి ఇష్క్ మూవీ లో నితిన్ వాడుకున్నారు. విజయం అందుకున్నారు.