సినిమా అనే కలల ప్రపంచంలో సక్సెస్ అనేది నిచ్చెన లాంటిది. ఆ సక్సెస్ అనేది దగ్గిరకు రాకపోతే అందమైన జీవితంగా కూడా దుర్భరంగామారిపోతుంది . సక్సెస్ లేకపోతే డబ్బు, హోదా, గౌరవం ఏమీ ఉండవు. నిజమైన స్నేహితులు తప్పా అన్నీ దూరమైపోతాయి. సెలెబ్రిటీ జీవితం పులి మీద సవారీ లాంటిదే.. దిగితే అది నిన్ను చంపేస్తుంది. ఒక్కోసారి కోరుకున్న జీవితం దొరక్క..ఎదో విధంగా బ్రతకలేక చావే శరణ్యం అనిపిస్తుంది. మానసిక వేదన ముందు కుటుంబం, స్నేహితులు, అభిమానులు ఎవరూ గురుతురారు.
ఈ జెనరేషన్ లో బాగా పాపులర్ అయిన ముగ్గురు యువ హీరోలు ఇలా తమ జీవితాలను అర్థాంతరంగా ముగించారు. ప్రతి ఆరేళ్లకు ఒకరు చొప్పున వీరు మరణించడం విషాదకరమైన యాదృచ్ఛికం. వారెవరెంటే కునాల్ సింగ్, ఉదయ్ కిరణ్ మరియు సుశాంత్ సింగ్ రాజపుత్. వీరు ముగ్గురు ముప్పై ఏళ్ల ప్రాయంలో ఆత్మ హత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు. 1999లో వచ్చిన ప్రేమికుల రోజు చిత్రంతో అందరికీ పరిచయమైన హీరో కునాల్ ఆ సినిమా సక్సెస్ తో వరుస అవకాశాలు అందుకున్నారు. 2007నాటికి ఆయన కెరీర్ ఒడిదుడులకు లోనయ్యింది. ప్లాప్స్ , మొదలుపెట్టిన సినిమాలు ఆగిపోవడం వంటి విషయాలు ఆయన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. దీనితో ఆయన 2008లో ముంబైలోని ఓ అపార్ట్మెంట్ లో ఉరి వేసుకొని మరణించారు.
2000 లో వచ్చిన చిత్రం సినిమాతో భారీ హిట్ అందుకున్న ఉదయ్ కిరణ్ నువ్వు నేను, మనసంతా నువ్వే అనే హ్యాట్రిక్ విజయాలతో హాట్ ఫేవరేట్ హీరో అయ్యారు. 2010నాటికి ఆయన కెరీర్ అయోమయంలో పడింది. దీనితో ఆయన 2014లో హైదరాబాద్ లోని తన నివాసంలో ఉరి వేసుకొని మరణించారు. ఇక సుశాంత్ టీవీ నటుడిగా కెరీర్ ప్రారంభించి 2013లో వచ్చిన కైపోచే చిత్రంతో హీరోగా మారి మంచి విజయాలను అందుకున్నాడు. సక్సెస్ ట్రాక్ లో ఉన్న సుశాంత్ మరణం వెనుక పరిశ్రమ దూరం పెట్టడమే అని తెలుస్తుంది.