డబ్బుల కోసం దిగజారొద్దంటున్న ఆ హీరోయిన్ ఫ్యాన్స్

ఎంత పెద్ద హీరోయిన్ అయినా సినిమా ఇండస్ట్రీలో ఐటమ్స్ సాంగ్స్ చేయడం కొత్తేం కాదు. ఇది చాలా సాధారణమైన విషయమే. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్లు నటించిన ఐటమ్ సాంగ్స్ ఆ సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించాయి అనడంలో సందేహం లేదు. ఆ సాంగ్స్ చేసినందుకు వారికి రెమ్యునరేషన్ కూడా బాగానే ముడుతుంది. అందుకే స్టార్ హీరోయిన్లు ప్రత్యేక గీతాల్లో నటించేందుకు ఇష్టపడతారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనేది వారి అభిప్రాయం కూడా కావొచ్చు.

తాజాగా ఆ జాబితాలోనే చేరిపోయింది నేషనల్ క్రష్  (Rashmika) రష్మిక మందన్నా. పేరుకు కన్నడ బ్యూటీ అయినా తెలుగులో పలు సినిమాల ద్వారా ఫుల్ పాపులర్ అయింది. ప్రస్తుతం అది ఇది అని లేకుండా అన్ని భాషల్లో నటిస్తూ నాలుగు చేతులా సంపాదిస్తోంది. అనతి కాలంలోనే నేషనల్ క్రష్ గా పబ్లిసిటీ మూటగట్టుకుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీల సినిమాలో చాలా ఉన్నాయి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నా.. అమ్మడికి క్రేజీ ఆఫర్స్ దక్కుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమాలో ఓ ఐటం సాంగ్ చేయబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది. అక్కడ నటించిన సినిమాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అక్కడ హిట్ కొట్టలేదు. కానీ అక్కడ రష్మిక క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

ఈ క్రమంలోనే రష్మికకు స్టార్ హీరో ఐటమ్ గర్ల్ గా ఛాన్స్ ఇచ్చారని సమాచారం. స్టార్ హీరో కావడం భారీగా పారితోషకం ముట్టచెపుతామనడంతో రష్మిక సైతం ఆఫర్ ఒప్పుకునే స్థితిలోనే ఉందని తెలుస్తోంది. అదే నిజమైతే ఫస్ట్ టైం రష్మిక కెరీర్లో బాలీవుడ్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించే అవకావం ఉంది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus