తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్లో గర్వించే విధంగా నిలబెట్టింది మన దర్శక ధీరుడు రాజమౌళి. ‘బాహుబలి’ సినిమాతో కొత్త టెక్నాలజీలను, భారీ బడ్జెట్ సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు దర్శకులకు సరికొత్త బాటలు వేసాడు అనటంలో సందేహమే లేదు. బాహుబలి 1&2 , RRR చిత్రాలతో భారతీయ చలన చిత్రంలో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న రాజమౌళి, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి’ మూవీ రూపొందిస్తున్న సంగతి మనందరికీ తెల్సిందే. ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పడు ఈ మూవీకి సంబంధించి ఒక వార్త నెట్టింట X వేదికగా ట్రేండింగ్ అవుతుంది.
అదేంటంటే… ‘వారణాసి’ మూవీలో కథానాయకుడు మహేష్ బాబు మొత్తం 5 పాత్రలలో కనిపించబోతున్నాడని సమాచారం. అయితే ఇప్పటికే టైటిల్ రివీల్ ఈవెంట్ లో మహేష్ ‘రాముడిగా’ ఒక 30 నిమిషాల ఎపిసోడ్ ఉండబోతుందని తెలియజేసారు డైరెక్టర్. ఈ సీక్వెన్స్ మొత్తం సినిమాకే హైలైట్ గా నిలవనుందని కూడా చెప్పుకొచ్చారు. దాంతో పాటు హీరో ‘రుద్ర’ క్యారెక్టర్ లో కూడా రోల్ ప్లే చేస్తున్నట్లు టైటిల్ గ్లిమ్ప్స్ ద్వారా మనకి అర్ధం అవుతుంది.
ఈ విధంగా ఇప్పటికే ‘వారణాసి’ చిత్రానికి సంబందించి రెండు పాత్రలలో హీరో మహేష్ నటిస్తుండగా, ఇంకా మూడు గెటప్స్ లో కూడా కనపడనున్నారని బజ్. ఆ మూడు పాత్రలలో ఒకటి శివుడు, ఇంకోటి ద్వాపరయుగం లో శ్రీ కృష్ణుడిగా , చివరిగా పునర్జన్మలోని క్యారెక్టర్ గా మొత్తం మీద ఐదు క్యారెక్టర్ లలో మహేష్ సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకుల్ని తన మేజిక్ తో మైమరిపించబోతున్నారని సినీ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తున్న టాక్.