1990 ల టైములో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ మహారాజుగా వెలుగుతున్న రోజులవి.ఆయన సినిమాల్లో అవకాశాల కోసం నటీనటులు ఎగబడేవారు. ఇంకా చెప్పాలంటే చిరంజీవి సినిమాలో ఛాన్స్ వస్తే.. రెండు, మూడు సినిమా ఆఫర్లను కూడా వదులుకోవడానికి రెడీ అయిపోయేవారు. అంత క్రేజ్ ఉండేది మెగాస్టార్ చిరంజీవి సినిమాకి..! అయితే కొంతమంది భామలకు మెగాస్టార్ సరసన హీరోయిన్ ఛాన్స్ వస్తే.. మిస్ చేసుకున్నారట. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) రాశి : చిరంజీవి హీరోగా ‘మనసంతా నువ్వే’ ‘నేనున్నాను’ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కానీ ఆ ప్రెజెక్టు సెట్స్ పైకి వెళ్ళలేదు. అయినప్పటికీ చర్చల దశలో ఉన్నప్పుడు హీరోయిన్ గా రాశిని సంప్రదించారట. కానీ ఆమె రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ ప్రాజెక్టుకి నొ చెప్పిందట.
2) ఇంద్రజ : చిరు సూపర్ హిట్ మూవీ ‘బావగారు బాగున్నారా’ లో ఓ హీరోయిన్ గా ఈమెను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వలన ఆ ఛాన్స్ ను ఈమె మిస్ చేసుకుంది.
3) అశ్విని : బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘భానుమతి గారి మొగుడు’ చిత్రంలో నటిస్తున్న టైములో చిరు నటిస్తున్న ఓ సినిమాలో ‘జేబు దొంగ’ సినిమాలో ఈమెను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఈమె నొ చెప్పడంతో భానుప్రియని తీసుకున్నారు మేకర్స్.
4) ఆమని : ‘రిక్షావోడు’ చిత్రంలో నగ్మా ప్లేస్ లో మొదట ఈమెనే హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఎందుకో ఈమె చివరి నిమిషంలో తప్పుకుంది.