సెన్సేషనల్ డైరెక్టర్స్ అందరూ కలిసి సంచలనం సృష్టించనున్నారు

నరేంద్రమోడీ యొక్క ఇండియాని డిజిటలైజ్ చేసే ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనే విషయం తెలియదు కానీ.. సినిమా ఇండస్ట్రీ మాత్రం పూర్తిస్థాయిలో డిజిటిలైజ్ అయిపోయింది. ఆల్రెడీ బాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు ఈ డిజిటలైజేషన్ ను సీరియస్ గా తీసుకొని థియేటర్లలో రిలీజ్ చేసే సినిమాలకంటే ఆన్ లైన్ ప్లాట్ఫార్మస్ లో రిలీజ్ చేసే సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండగా.. ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల వంతు వచ్చింది.

ఇప్పటివరకూ టాలీవుడ్ నుంచి నెట్ ఫ్లిక్స్ కోసం సిరీస్ ను డైరెక్ట్ చేసిన దర్శకులు లేరు. దేవా కట్ట, ప్రవీణ్ సత్తారు “బాహుబలి” నెట్ ఫ్లిక్స్ సిరీస్ మొదలెట్టినప్పటికీ.. అది ఎక్కడివరకు వచ్చింది అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే.. ఇటీవల కాలంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ గా నిలిచిన యంగ్ డైరెక్టర్స్ “తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సందీప్ రెడ్డి వంగా, సంకల్ప్ రెడ్డి”లు కలిసి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ కోసం ఒక ఆంథాలజీ సిరీస్ ను డైరెక్ట్ చేయనున్నారు. నాలుగు ఎపిసోడ్స్ ఉండే ఈ సిరీస్ లోని ఒక్కో ఎపిసోడ్ ను ఒక దర్శకులు డైరెక్ట్ చేస్తారు. బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన రోనీ స్క్రూవాలా ఈ సిరీస్ ను ప్రొడ్యూస్ చేయనున్నారు. తెలుగులో మాత్రమే కాక తమిళ, హిందీ భాషల్లో సదరు సిరీస్ ను డబ్బింగ్ రూపంలో విడుదల చేసే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus