హీరోయిన్ ప్రణీత పేరుతో చీటింగ్ చేశారంటూ పోలీసులకు కంప్లైంట్..

ఈ మధ్య కాలంలో కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు చెప్పి.. సామాన్యుల దగ్గర నుండీ డబ్బులు కొట్టేస్తున్నారు కొందరు దుండగులు. మొన్నటికి మొన్న సింగర్ సునీత మేనల్లుడిని అంటూ ఓ వ్యక్తి మోసాలు చెయ్యడం మొదలుపెట్టాడట. దాంతో వెంటనే అప్రమత్తమైన సునీత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ‘దయచేసి ఇలాంటి వాళ్ళను నమ్మొద్దు…నా మేనల్లుడు అని చెప్పుకుని డబ్బులు వసూల్ చేస్తున్న వ్యక్తిని నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దు’ అంటూ సునీత తన అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

అంతేకాదు విజయ్ దేవరకొండ పేరుతో కూడా కొందరిని మోసం చేస్తున్నారంటూ కూడా పెద్ద రచ్చ జరిగింది. ఇదిలా ఉండగా.. తాజాగా హీరోయిన్ ప్రణీత పేరుతో కూడా ఇద్దరు వ్యక్తులు.. బెంగుళూరుకు చెందిన ఓ బిల్డర్ నుండీ 13.5 లక్షలు వసూల్ చేసి టోపీ పెట్టారట. వివరాల్లోకి వెళితే.. మహమ్మద్ జునాయత్ మరియు వర్షా అనే ఇద్దరు వ్యక్తులు… హీరోయిన్ ప్రణీత మేనేజర్లమంటూ ఓ బిల్డర్ దగ్గర ఈ మోసానికి పాల్పడ్డారట. ‘బెంగుళూరుకు చెందిన ఓ హోటల్ లో ప్రణీత ఉన్నారు..

మీ సంస్థకు ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా చేసేలా డీల్ సెట్ చేస్తాము’ అంటూ అతన్ని నమ్మించడం మొదలుపెట్టారట. అటు తరువాత ‘ప్రణీత మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చెయ్యడానికి ఒప్పుకున్నారని.. మీరు రూ.13.5 లక్షలు చెల్లిస్తే హోటల్ లో ఉన్న ప్రణీత గారితో అగ్రిమెంట్ పై సైన్ చేయిస్తామని’ చెప్పి అంత మొత్తం డబ్బు తీసుకొని అక్కడి నుండీ ఎస్కేప్ అయిపోయారట. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన బిల్డర్.. బెంగుళూరు హైగ్రౌండ్స్ పోలీస్ లకు ఫిర్యాదు చేసాడట. ప్రస్తుతం వారు దర్యాప్తు చెయ్యడం మొదలుపెట్టారని తెలుస్తుంది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus