‘800’ కోసం మధుర్ మిట్టల్ నుంచి ముత్తయ్య మురళీధరన్‌గా…

లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో అక్టోబర్ 6న థియేటర్లలో విడుదల అవుతోంది. ముత్తయ్య మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. మురళీధరన్ వైఫ్ మధుమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు.

‘800’ కోసం ముత్తయ్య మురళీధరన్ పాత్ర కోసం మధుర్ మిట్టల్ ఏ విధంగా రెడీ అయినదీ మేకింగ్ వీడియో విడుదల చేశారు. ముత్తయ్యగా మారడం కోసం తాను ఏం చేసినదీ మధుర్ మిట్టల్ వివరించారు.

మేకప్ కోసమే ప్రతి రోజూ రెండు మూడు గంటలు పట్టేదని మధుర్ మిట్టల్ తెలిపారు. ”హెయిర్ స్టైల్ నుంచి స్కిన్ టోన్ వరకు ప్రతి విషయంలో ఎంఎస్ శ్రీపతి సార్ చాలా కేర్ తీసుకున్నారు. మా మేకప్ బృందానికి కూడా నేను థాంక్స్ చెప్పాలి. వాళ్ళు చాలా ఒప్పిగ్గా రెండు మూడు గంటలు మేకప్ చేశారు” అని మధుర్ మిట్టల్ చెప్పారు.

ముత్తయ్య మురళీధరన్ బాడీ లాంగ్వేజ్, ఆయన బౌలింగ్ స్టైల్ పట్టుకోవడం కోసం ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉన్న వీడియోలు చేసినట్లు మధుర్ మిట్టల్ తెలిపారు. ”ఆన్‌లైన్‌లో మురళీధరన్ గారి వీడియోలు ఎన్ని అయితే ఉన్నాయో అవి అన్నీ చూశా. ఆయన పర్సనల్ ఆర్కైవ్స్ నుంచి కొన్ని తీసుకున్నా. ఒక బౌలింగ్ కోచ్ ఉన్నారు. ఆయన దగ్గర కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నా. ‘800’ స్టార్ట్ చేయడానికి ముందు నేను వేరే సినిమా చేస్తున్నా. ఆ షూటింగ్ అయ్యాక… ప్రతి రోజూ రెండు మూడు గంటలు బౌలింగ్ ప్రాక్టీస్ చేశా. కొన్నాళ్ల క్రితం నాకు యాక్సిడెంట్ కావడంతో నా ఎల్బో కూడా కొంచెం ఆయనలా ఉంటుంది” అని మధుర్ మిట్టల్ వివరించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus