అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కళ్యాణ్ పూర్తి పేరు ఇదే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా అజ్ఞాతవాసి చిత్రం ప్రీ రిలీజ్ కి ముందే అనేక రికార్డులను నెలకొల్పింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మరో ఐదు రోజుల్లో థియేటర్లోకి రానుంది. ఈ సినిమా ట్రైలర్, సాంగ్ ప్రోమోల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని బ్యానర్ అధినేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు కూడా లేకపోలేదు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ పేరు బయటికి వచ్చింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గత చిత్రాలైన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల్లో సంజయ్‌ సాహు, గౌతమ్‌‌ నంద అని అందమైన పేర్లు పెట్టారు.

ఇందులోనూ అంతకు మించి మంచి పేరు పెట్టారు. “అజ్ఞాతవాసి” సినిమాలో పవన్ పాత్రకు అభిషిక్త్‌ భార్గవ అని పేరు పెట్టారని తెలిసింది. అంతేకాదు సినిమాలో అందరూ పవన్‌ను ముద్దుగా ఏబీ(అభిషిక్త్‌ భార్గవ) అని పిలుస్తుంటారని సమాచారం. ఈ చిత్ర ఆల్బంలోను “ఏబీ ఎవరో నీ బేబీ” అంటూ వచ్చే పాటలోనే త్రివిక్రమ్ క్లూ ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయం స్పష్టమైంది. అను ఇమ్యానియాల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కుష్బూ, వెంకటేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్తారింటికి దారేదిలో నటించిన బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఈ చిత్రంలోనూ మంచి రోల్ పోషించారు. ఇంతమంది నటీనటులు నటిస్తున్న ఈ చిత్రం భారీ కలక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలవారు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus