`ఎఫ్ 2` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌!

విభిన్న‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ కొత్త‌దనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్ట‌రీ వెకంటేశ్‌… ఫిదా, తొలి ప్రేమ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించిన యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న మ‌ల్టీస్టార‌ర్ `ఎఫ్ 2`. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ ట్యాగ్ లైన్‌. వెంక‌టేశ్ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొంద‌నున్న ఈ సినిమాను యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు. `ప‌టాస్‌`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌` హ్యాట్రిక్ విజ‌యాల త‌ర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న చిత్ర‌మిది. మంచి చి మెసేజ్‌తో పాటు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించడంలో మంచి ప‌ట్టు ఉన్న అనిల్ రావిపూడి `ఎఫ్ 2` సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా…

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “కుటుంబ క‌థా చిత్రాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చే మా బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న ఔట్ అంట్ ఔట్ ఫ్యామిలీ ఫ‌న్ రైట‌ర్ `ఎఫ్‌2`. మెసేజ్‌తో పాటు అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా యాడ్ చేసి లాఫింగ్ రైడ‌ర్‌లాంటి చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మూడు వ‌రుస హిట్స్ త‌ర్వాత చేస్తోన్న చిత్ర‌మిది. వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ సూప‌ర్బ్‌కాంబినేష‌న్‌తో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. దీపావ‌ళి సంద‌ర్భంగా ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేశాం. ఇప్ప‌టి వ‌ర‌కు 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. క్లైమాక్స్‌, మూడు పాట‌లు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉన్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus