కోరిక తీర్చలేదని హీరోయిన్ ని అవాయిడ్ చేస్తున్న హీరో గ్యాంగ్

  • December 26, 2018 / 06:21 AM IST

హీరోయిన్ల కెరీర్లు కొవ్వొత్తుల్లాంటివని అందరూ భావిస్తుంటారు. ఇందులో నిజమెంత అనేది అందరికీ తెలిసిందే. అయితే.. ఈమధ్యకాలంలో హీరోయిన్ల కెరీర్ లు కొవ్వుత్తుల్లా కాకుండా నూనె దీపాల్లా తయారయ్యాయి. ఎవరైనా (దర్శకనిర్మాత/కథానాయకుడు) నూనె వేస్తే తప్ప వెలగడం లేదు. అందుకే హీరోయిన్లందరూ పరాన్న జీవుల్లా తయారయ్యారు. ఇప్పుడు ఓ యువ కథానాయకి పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. నిన్నమొన్నటివరకూ కొందరు హీరోలు, కొందరు నిర్మాతల సహాయంతో వరుస ఆఫర్లు అందిపుచ్చుకున్న ఓ యువ కథానాయికను ప్రస్తుతం పట్టించుకొనే నాధుడు లేకుండాపోయాడు.

అందుకు చాలా కారణాలున్నప్పటికీ.. ముఖ్యకారణం మాత్రం ఆమె ఇదివరకట్లా ఒక హీరో గ్యాంగ్ కి అందుబాటులో లేకపోవడమేనని టాక్ వినిపిస్తోంది. ఆ యువ హీరోల గ్యాంగ్ చాలా పవర్ ఫుల్.. వాళ్ళకి అందుబాటులో ఉండే హీరోయిన్స్ కి మాత్రమే ఆఫర్లు ఇప్పించడం.. ఎవరైనా మధ్యలో హ్యాండ్ ఇస్తే వాళ్ళ కెరీర్ లు పాడుచేయడం అనేది వాళ్ళకి చాలా కామన్. అందుకే.. ఈమధ్యకాలంలో ఆమెకు ఆఫర్లు భారీగా తగ్గిపోయాయట. దాంతో ఇప్పుడు ఆ హీరో గ్యాంగ్ కు తలోగ్గాలో లేక ఇండస్ట్రీ నుంచి జంప్ అయిపోవాలో తెలియని కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతోంది ఆ యువ కథానాయకి. ఇటీవలే ఓ భారీ ఫ్లాప్ అందుకొన్న ఆ హీరోయిన్ చేతిలో ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క ఆఫర్ మాత్రమే ఉంది

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus