Sudheer: సుడిగాలి సుధీర్ ఆ జాబితాలో చేరిపోయారా?

సుడిగాలి సుధీర్ గాలోడు సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో గాలోడు సినిమాకు అంచనాలకు మించి కలెక్షన్లు వస్తుండటం గమనార్హం. గాలోడు మాస్ మూవీ కావడంతో బీ, సీ సెంటర్లలో భారీ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంది. సుడిగాలి సుధీర్ త్వరలో జబర్దస్త్ షోలో కూడా రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇతర ఛానెళ్లలో షోలు చేసినా సుడిగాలి సుధీర్ కు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.

సుడిగాలి సుధీర్ కు బుల్లితెర షోలు ఈ మధ్య కాలంలో మంచి పేరును తెచ్చిపెట్టడం లేదు. అయితే గాలోడు సక్సెస్ తో సుధీర్ రేంజ్ మారిపోయినట్టేనని చెప్పాలి. సుధీర్ కు కోటి రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధమవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గాలోడు టైటిల్ సుడిగాలి సుధీర్ కు ప్లస్ అయింది. కొంతమంది ఈ టైటిల్ గురించి నెగిటివ్ కామెంట్లు చేసినా టైటిల్ క్యాచీగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది.

గాలోడు సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయడం కూడా ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయిందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సైతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. సుడిగాలి సుధీర్ కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమమవుతున్నాయి.

సుధీర్ ప్రస్తుతం ఆహా ఓటీటీ కోసం ఒక షో చేస్తుండగా కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పేరుతో ప్రసారం కానున్న ఈ షో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ షో డిసెంబర్ 2వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus