విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘గామి’ (Gaami). విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్. ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్’ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ (Karthik Sabareesh) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్, మేకింగ్ వీడియో వంటివి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. మార్చి 8న శివరాత్రి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి.
ఆల్రెడీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
3.31 cr
సీడెడ్
0.93 cr
ఉత్తరాంధ్ర
0.94 cr
ఈస్ట్
0.66 cr
వెస్ట్
0.41 cr
గుంటూరు
0.51 cr
కృష్ణా
0.49 cr
నెల్లూరు
0.29 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
7.54 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.82 cr
ఓవర్సీస్
2.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
10.76 cr (షేర్)
‘గామి’ (Gaami) చిత్రానికి రూ.9.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.10.76 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.1.26 కోట్ల లాభాలను అందించింది.