వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో గాండీవధారి అర్జున మూవీ తెరకెక్కగా ఈ నెల 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 55 కోట్ల రూపాయలు అని సమాచారం. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు 26 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. కనీసం 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే ఈ సినిమా హిట్ గా నిలిచే అవకాశాలు ఉంటాయి.
గాండీవధారి అర్జున సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే బడ్జెట్ ఎక్కువ మొత్తం కావడంతో వరుణ్ తేజ్ ఈ సినిమాతో భారీ రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. వరుణ్ తేజ్ మాత్రం ఈ సినిమా రిజల్ట్ విషయంలో పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఎలాంటి సమస్య ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా విదేశాల్లో చేశారని సమాచారం అందుతోంది. ప్రవీణ్ సత్తారుకు ఈ సినిమా సక్సెస్ సాధించడం కెరీర్ పరంగా కీలకం కానుంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే ప్రవీణ్ సత్తారుకు కొత్త ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ప్రవీణ్ సత్తారు ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. వరుణ్ తేజ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల ఎంపికలో జాగ్రత్త వహించాల్సి ఉంది. మెగా హీరోలతో కలిసి వరుణ్ తేజ్ మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుణ్ తేజ్ ఒకవైపు క్లాస్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకుల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వరుణ్ తేజ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.
మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?