Game Changer: రామ్ చరణ్ కెరీర్లో అతి తక్కువ కట్స్ వచ్చిన సినిమా ఇదేనేమో!

“ఆర్ఆర్ఆర్” తర్వాత రామ్ చరణ్ (Ram Charan) సోలో హీరోగా నటించిన “గేమ్ ఛేంజర్” (Game Changer)  మరో ఎనిమిది రోజుల్లో విడుదలకానుంది. శంకర్ (Shankar) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ డ్రామా జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలకానున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్.జె.సూర్య (SJ Suryah)  ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. శ్రీకాంత్ (Srikanth)  , జయరాం (Jayaram), అంజలి (Anjali) , నవీన్ చంద్ర (Naveen Chandra) తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇవాళ “గేమ్ ఛేంజర్” సెన్సార్ డీటెయిల్స్ తెలిసాయి.

Game Changer

165 నిమిషాల నిడివితో, కేవలం 5 కట్స్ తో, యు/ఎ (U/A) సర్టిఫికెట్ సంపాదించుకుంది గేమ్ ఛేంజర్ చిత్రం. ఆ కట్స్ కూడా చాలా నామమాత్రపువి కావడం గమనార్హం. అయితే.. అందులో బ్రహ్మనందం (Brahmanandam) పేరు ముందు పద్మశ్రీ అనేది ఎందుకు తీసేయాలన్నారో అర్థం కాలేదు కానీ.. అది మినహాయిస్తే పెద్ద కట్స్ ఐతే లేవు.

కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj) అందించిన కథతో శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కట్స్ అనేవి లేకుండా చిత్రబృందం జాగ్రత్తపడడం, అది కూడా రాజకీయ నేపథ్యంలో సినిమాకి అసలు కట్స్ లేకపోవడం అనేది చిత్రబృందం ఎంత జాగ్రత్తపడ్డారు అనేదానికి నిదర్శనం. దిల్ రాజు కెరీర్ లోనే బడ్జెట్ పెట్టిన ఈ చిత్రానికి టికెట్ హైక్స్ & బెనిఫిట్ షోస్ తెలంగాణలో ఉండే అవకాశం లేదు కాబట్టి, కేవలం ఆంధ్రాలో బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది.

సో, డే1 కలెక్షన్స్ అనేవి రికార్డ్ స్థాయిలో ఉండడం అనేది కాస్త కష్టం. అయితే.. సంక్రాంతి పండుగ బినిఫిట్ ఉంటుంది కాబట్టి.. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే, ప్యాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం సరికొత్త రికార్డులు నెలకొల్పడం అనేది పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. అయితే.. 12న “డాకు మహరాజ్” (Daaku Maharaaj), 14న “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vasthunnam)  కూడా ఉన్నాయి కాబట్టి సోలో రిలీజ్ బెనిఫిట్ అనేది లేకుండా కాస్త ఇబ్బందిపడే అవకాశం కూడా ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus