Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. ఫ్యాన్స్ కు పండగేనంటూ?

రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ థియేటర్లలో ఎప్పుడు రిలీజవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా ఈ సినిమా నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు. 2024 సంవత్సరం సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని దిల్ రాజు వెల్లడించారు. పుష్ప2 మూవీ విడుదలైన నెల రోజులకు అటూఇటుగా ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. తేదీని ప్రకటించకపోయినా నెల గురించి క్లారిటీ వచ్చేసింది.

మరోవైపు గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. జరగండి జరగండి సాంగ్ రిలీజ్ కోసం అభిమానులు సైతం ఒకింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీకి సరైన రిలీజ్ డేట్ కోసమే మేకర్స్ ఈ సినిమాను అప్పటికి వాయిదా వేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తెలుగులో మరింత బిజీ అవుతానని కియారా అద్వానీ ఫీలవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ హీరోయిన్లకు ప్రాధాన్యత పెరుగుతుండగా కొంతమంది హీరోయిన్లు టాలీవుడ్ లో మరింత సత్తా చాటాలని భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీకి ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఇతర భాషల్లో సైతం ఈ సినిమా సక్సెస్ సాధించి చరణ్ రేంజ్ ను మరింత పెంచాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఈ సినిమా (Game Changer) రెమ్యునరేషన్ల కోసమే 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు అవుతోందని తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ సైతం ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. 2024లో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus