Game Changer: ఈ సాంగ్ గేమ్ చేంజర్ కాదంటున్న రామ్ చరణ్ ఫ్యాన్స్!

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న పాన్ ఇండియన్ సినిమాల్లో భారీ రేంజ్ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాలలో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో గత ఏడాది ప్రారంభమైన ఈ సినిమా ఇంకా షూటింగ్ ని జరుపుకుంటూనే ఉంది. అన్నీ కరెక్ట్ గా కుదిరి ఉంటే, ఈ చిత్రం ఈపాటికి సంక్రాంతికి విడుదల అయ్యి ఉండేది.

కానీ మధ్యలో శంకర్ అంతకు ముందు మొదలు పెట్టిన కమల్ హాసన్ ‘ఇండియన్ 2 ‘ చిత్రం మళ్ళీ తిరిగి ప్రారంభించాల్సి వచ్చింది శంకర్. దాంతో నెలకి 15 రోజులు ‘గేమ్ చేంజర్’, మిగిలిన 15 రోజులు ‘ఇండియన్ 2 ‘ చేసుకుంటూ వచ్చాడు. అందువల్ల ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే శంకర్ సినిమాలో పాటలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

సినిమా కోసం ఆయన నిర్మాత చేత ఎంత ఖర్చు పెట్టిస్తాడో, సాంగ్స్ కోసం కూడా అంతే ఖర్చు పెట్టిస్తాడు. క్వాలిటీ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. కానీ నిన్న రాత్రి సోషల్ మీడియా లో లీక్ అయినా ‘గేమ్ చేంజర్’ పాట వింటే ఇది శంకర్ సినిమా పాట యేనా అని అనిపించక తప్పదు. అంత దరిద్రం గా ఉంది. థమన్ కంపోజ్ చేసిన ఈ ‘జరగండి..జరగండి’ అనే పాట కోసం 15 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టించారట.

కానీ అందుకు తగ్గట్టు ఔట్పుట్ కనీస స్థాయిలో కూడా లేదు. అయితే ఈ ట్యూన్స్ మొత్తం రఫ్ ట్యూన్స్ అని, సినిమాల్లో ఫైనలైజ్ అయిన ట్యూన్ అసలు కాదని, ఈ సినిమాకి పని చేస్తున్న పీఆర్ టీం సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. శంకర్ సినిమాలో పాటలు ఇంత చెత్తవి ఓకే చెయ్యరని, రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ ఆల్బం గా ఈ ‘గేమ్ చేంజర్’ (Game Changer) ఆల్బం నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus