‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా జనవరి 10 న విడుదల కాబోతోంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే..! దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ సినిమాపై హైప్ పెంచింది. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10న అన్ని భాషల్లోనూ విడుదల కావాల్సి ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయాలని దిల్ రాజు (Dil Raju) భావిస్తున్నారు.
అయితే ఇప్పుడు అది జరిగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా తమిళంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల నిలిచి పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది తాజా వార్త. విషయంలోకి వెళితే.. శంకర్ (Shankar) ‘ఇండియన్ 2’ (Indian 2) సినిమాని మొదలుపెట్టి కొంత భాగం షూటింగ్ చేసిన తర్వాత.. దాన్ని ఆపేసి ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ మొదలుపెట్టాడు. దీంతో ‘ఇండియన్ 2’ నిర్మాతలైన ‘లైకా ప్రొడక్షన్స్’ వారు కోర్టుకెక్కారు.
ముందుగా ‘షూటింగ్ మొదలుపెట్టిన తమ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయకుండా.. అగ్రిమెంట్ ను బ్రేక్ చేసి వేరే సినిమాని ఎలా సెట్స్ పైకి తీసుకెళ్తారంటూ?’ వారు ఆరోపించారు. దీంతో కోర్టు కూడా ‘ఇండియన్ 2’ చిత్రాన్ని సమాంతరంగా తెరకెక్కించాలని ఆదేశించింది. అయితే ‘ఇండియన్ 2’ ఫుటేజీ బాగా ఎక్కువైపోయింది. దీంతో రెండు పార్టులుగా సినిమాని రూపొందించారు. ‘ఇండియన్ 2’ రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది.
అయినప్పటికీ ‘ఇండియన్ 3’ ని రిలీజ్ చేసి నష్టాలు తీర్చాలని నిర్మాతలైన ‘లైకా’ వారు భావిస్తున్నారు. అందువల్ల ‘ఇండియన్ 3’ రిలీజ్ అయ్యే వరకు ‘ ‘గేమ్ ఛేంజర్’ ని తమిళనాడులో రిలీజ్ చేయకూడదు’ అంటూ వారు కోర్టుకెక్కారు. ఈ క్రమంలో ‘గేమ్ ఛేంజర్’ తమిళ్ రిలీజ్ అనేది సస్పెన్స్ లో పడినట్టు అయ్యింది.