సూపర్ కలెక్షన్స్ ను రాబడుతున్న తాప్సి ‘గేమ్ ఓవర్’..!

తాప్సీ నటించిన తాజా చిత్రం ‘గేమ్ ఓవర్’. గతంలో ‘మయూరి’ వంటి హారర్ థ్రిల్లర్ తో హిట్టందుకున్న అశ్విన్ శరవణన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం… ప్రివ్యూలతో మంచి రెస్పాన్స్ ను అందుకోవడంతో ప్రేక్షకుల్లో సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. దీంతో అదే రోజు నాలుగు చిత్రాలు విడుదలైనప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికే ఓటేశారు. అందుకే ఈ చిత్రానికే ఎక్కువ ఓపెనింగ్స్ దక్కాయి. ఈ చిత్రం మొత్తం మూడు భాషల్లో విడుదలైంది. కాగా మొదటిరోజు హిందీలో 38 లక్షలు, తమిళంలో 30 లక్షలు, తెలుగులో 29 లక్షలు కలిపి మొత్తంగా 97 లక్షల వరకూ రాబట్టడం విశేషం.

ఇక మొదటి రోజు హిట్ టాక్ రావడంతో శనివారం నాడు కలెక్షన్స్ డబుల్ అయ్యాయి. రెండో రోజు హిందీలో 88 లక్షలు, తెలుగులో 56 లక్షలు, తమిళంలో 50 లక్షలు కలిపి మొత్తంగా 1.94 కోట్లు రాబట్టింది. మొత్తంగా రెండు రోజులు కలిపి 2.91 కోట్ల రాబట్టింది. ఇక ఆదివారం కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఆ రోజు కూడా కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయని ట్రేడ్ వర్గాల సమాచారం. ఎస్. శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus