సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత 4 నాలుగు నెలల్లో కృష్ణ. కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలు.. కైకాల సత్యనారాయణ, చలపతి రావు వంటి సీనియర్ నటులు మరణించారు. ఆ విషాదాల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకముందే ఇప్పుడు సీనియర్ నటుడు, దర్శకుడు అయిన వల్లభనేని జనార్దన్ కూడా మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన తాజాగా అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.
కానీ పరిస్థితి విషమించడంతో జనార్దన్ తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త బయటకు రాగానే టాలీవుడ్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి అని చెప్పొచ్చు. ఆయన మరణానికి చింతిస్తూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1980 వ సంవత్సరంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘గజ దొంగ’ చిత్రంతో ఈయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ నటించిన ‘తిరుగులేని మనిషి’, కృష్ణంరాజు నటించిన ‘రగిలే జ్వాల’ వంటి చిత్రాలకు కూడా పనిచేశారు.
తర్వాత ‘అర్జున్ ఆర్ట్స్’ అనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించి ‘మామ్మ గారి మనవలు’ సినిమాను నిర్మించారు. ‘గుండమ్మ కథ’ చిత్రాన్ని రివర్స్ చేసి ఈ సినిమాని రూపొందించారు కానీ 70 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమా ఆగిపోయింది. విజయబాపినీడు ఇతనికి మామగారు కావడంతో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో ఇతనికి అవకాశం దక్కింది. ఆ సినిమాలో ఓ క్రూరమైన పోలీస్ ఆఫీసర్ గా ఇతను కనిపించి మెప్పించాడు.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?