‘గ్యాంగ్ స్టర్ గంగ రాజు’ చిత్రం షూటింగ్ పూర్తి

‘వలయం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న లక్ష్ చదలవాడ హీరోగా రూపొందుతోన్న తదుపరి చిత్రం `గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు’. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్’  పతాకం పై ‘చదలవాడ బ్రదర్స్’ సమర్పణలో మంచి అభిరుచి గల నిర్మాత పద్మావతి చదలవాడ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

డిఫరెంట్ కథాంశంతో కమర్షియల్ హంగులతో రూపొందుతోన్న ‘గ్యాంగ్ స్టర్ గంగ రాజు’ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ … అలాగే సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సమకూర్చిన పాటలకు ప్రేక్షకుల నుండీ మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఇటీవల విడుదలైన `గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు`ఫుల్ టైటిల్ వీడియో సాంగ్ కూడా యూట్యూబ్లో దూసుకుపోతుండడం మరో విశేషం.

ఇక ఇటీవల జరిగిన షెడ్యూల్ తో ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాకి సాయి కార్తీక్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.    అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి డిసెంబర్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus