Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ
- November 1, 2026 / 05:46 PM ISTByPhani Kumar
ఉత్తరాంధ్ర జానపద గాయిని, తన గాత్రంతో పుష్కరకాలం పాటు అక్కడి జనాలను ఉర్రూతలూగించిన కళాకారిణి ‘గరివిడి లక్ష్మి’. ఆమె జీవిత కథతో ‘గరివిడి లక్ష్మి'(Garividi Lakshmi) అనే సినిమా రూపొందింది. ఆనంది టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టిజి విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. గౌరి నాయుడు జమ్ము ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. చరణ్ అర్జున్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Garividi Lakshmi Collections

ఆనందితో పాటు ఈ సినిమాలో రాగ్ మయూర్, వి కె నరేశ్, రాశి, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య వంటి క్రేజీ ఆర్టిస్టులు కూడా నటించారు. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో చిత్ర బృందం రిలీజ్ కి ముందు పలు ఏరియాల్లో ప్రీమియర్ షోలు వేయడం జరిగింది. వాటికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. మొదటి వారం డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది. 2వ వారం కూడా ఈ సినిమా డీసెంట్ రన్ కొనసాగించింది. ఒకసారి గరివిడి లక్ష్మి (Garividi Lakshmi) 2 వీక్స్ కలెక్షన్స్ ను గమనిస్తే:
| డే1 | 0.40 Cr |
| డే2 | 0.51 cr |
| డే3 | 0.59 cr |
| డే4 | 0.48 cr |
| డే5 | 0.46 cr |
| డే6 | 0.41 cr |
| డే7 | 0.37 cr |
| డే8 | 0.43 cr |
| డే9 | 0.48 cr |
| డే10 | 0.42 cr |
| డే11 | 0.23 cr |
| డే12 | 0.17 cr |
| డే13 | 0.14 cr |
| డే14 | 0.11 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | రూ.5.2 cr (షేర్) |
‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi) సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.2.5 కోట్లు(షేర్) . మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 2 వారాలు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా రూ.5.2 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.8.2 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఓవరాల్ గా రూ.2.7 కోట్ల వరకు లాభాలు అందించింది. ఉత్తరాంధ్ర రీజన్లో ఈ సినిమా ఆల్మోస్ట్ 70 శాతం కలెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. అక్కడి బయ్యర్స్ కి మంచి ప్రాఫిట్స్ ను అందించింది.
2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?















