Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్
- October 28, 2026 / 07:30 AM ISTByPhani Kumar
ఉత్తరాంధ్ర జానపద గాయిని, తన గాత్రంతో పుష్కరకాలం పాటు అక్కడి జనాలను ఉర్రూతలూగించిన కళాకారిణి ‘గరివిడి లక్ష్మి’. ఆమె జీవిత కథతో ‘గరివిడి లక్ష్మి'(Garividi Lakshmi) అనే సినిమా రూపొందింది. ఆనంది టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టిజి విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. గౌరి నాయుడు జమ్ము ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. చరణ్ అర్జున్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Garividi Lakshmi Collections

ఆనందితో పాటు ఈ సినిమాలో రాగ్ మయూర్, వి కె నరేశ్, రాశి, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య వంటి క్రేజీ ఆర్టిస్టులు కూడా నటించారు. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో చిత్ర బృందం రిలీజ్ కి ముందు పలు ఏరియాల్లో ప్రీమియర్ షోలు వేయడం జరిగింది. వాటికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. మొదటి వీకెండ్ ఈ సినిమా పర్వాలేదు అనిపించేలా వసూళ్ళు రాబట్టింది. వీక్ డేస్ లో కూడా ఓకే అనిపించింది. 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది. ఒకసారి గరివిడి లక్ష్మి (Garividi Lakshmi) 9 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:
| డే1 | 0.40 Cr |
| డే2 | 0.51 cr |
| డే3 | 0.59 cr |
| డే4 | 0.48 cr |
| డే5 | 0.46 cr |
| డే6 | 0.41 cr |
| డే7 | 0.37 cr |
| డే8 | 0.43 cr |
| డే9 | 0.48 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | రూ.4.13 cr (షేర్) |
‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi) సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.2.5 కోట్లు(షేర్) . మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 9 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా రూ.4.13 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.7.1 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఓవరాల్ గా రూ.1.63 కోట్ల వరకు లాభాలు అందించింది. ఉత్తరాంధ్ర రీజన్లో ఈ సినిమా ఇప్పటికీ బాగా కలెక్ట్ చేస్తుంది. అక్కడి బయ్యర్స్ కి డబుల్ ప్రాఫిట్స్ రావడం గ్యారెంటీ అనే చెప్పాలి.
బిష్ణోయ్ గ్యాంగ్ అసలు టార్గెట్ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?















