ఇలాంటి పాత్రలు చేయడం బాలయ్యకు మాత్రమే సాధ్యం : చిరు

బాలకృష్ణ నటించనున్న 100 వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోస్ లో అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ తో పాటు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ బాలకృష్ణ కెరీర్ లో ఈ చిత్రం చాలా ప్రతిష్టాత్మకమైంది. 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి కథను ఎంపిక చేసుకున్నప్పుడే..మొదటి విజయం సాధించారు. ఇలాంటి చారిత్రాత్మక చిత్రాలకు క్రిష్ మంచి దర్శకుడు. కంచె ద్వారా అది నిరూపితం అయ్యింది. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో మరో మైలు రాయిగా అందుకుంటుంది. ఇలాంటి పాత్రలు చేయడం బాలకృష్ణకు అవలీలగా ఉంటుంది. ఆయనకు అది కేక్ వాక్ లాంటిది. ఈ రోజుల్లో 100 రోజులు ఆడే చిత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటిది ఈ చిత్రం సిల్వర్, గోల్డెన్ జూబ్లీ జరుపుకోవాలని, ఈ చిత్రం తప్పక ఘనవిజయం సాధిస్తుంద’న్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus