బహుపరాక్ బాలయ్య!

నందమూరి నటసింహం బాలకృష్ణ “డిక్టేటర్” విడుదలై మంచి విజయాన్ని దక్కించుకొందన్న సంతోషం కంటే.. ఆ తరువాత ఆయన నటించబోయే 100వ చిత్రంపైనే అభిమానులు ఎక్కువ దృష్టి సారించారు. బాలయ్య కూడా తన 100వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాడు. అందుకే సాదాసీదాగా ఏదో ఒక ఫక్తు కమర్షియల్ సినిమా కాకుండా.. అభిరుచిగాల దర్శకుడైన క్రిష్ దర్శకత్వంలో పరాక్రముడైన “గౌతమీపుత్ర శాతకర్ణి” జీవిత చరిత్రను కథాంశంగా తీసుకొని అదే పేరుతో సినిమాను మొదలపెట్టాడు.

ప్రారంభోత్సవం రోజే క్రిష్ తన క్రియేటివిటీని టైటిల్ డిజైన్ రూపంలో చూపించి.. నందమూరి అభిమానులను అమితంగా ఆకట్టుకొన్నాడు. అలాగే.. రేపు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా “అంతకు మించి” అనే స్థాయిలో ఉంది. శత్రువుల గుండెలు చీల్చుకుంటూ కథనరంగంలో కథం తొక్కుతున్న పరాక్రముడిగా బాలయ్య రూపు సగటు ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకొనే స్థాయిలో ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కేవలం బాలయ్య అభిమానులకే కాదు యావత్ భారతదేశంలో తెలుగు సినిమా అభిమానుకి “గౌతమీపుత్ర శాతకర్ణి” ఫస్ట్ లుక్ విపరీతంగా నచ్చేసింది.

ఈ చారిత్రక చిత్రంతో.. బాలకృష్ణ తన 100వ చిత్రాన్ని చరిత్రలో నిలిచిపోతుండడానికి ఈ ఫస్ట్ లుక్కే నిదర్శనం. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు “ఫిల్మీ ఫోకస్” ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. బాలయ్యను ఇంత శక్తిమంతంగా తీర్చిదిద్దినందుకు దర్శకుడు క్రిష్ కు నందమూరి అభిమానుల తరుపున కృతజ్నతలు తెలుపుతోంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus