జూన్ 10న “శాతకర్ణి” ఫస్ట్ లుక్ ..!

గౌతమి పుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ 100 వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే మొరాకోలో ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం బాలకృష్ణ, కబీర్ బేడి కాంబినేషన్ లో పలు యుద్ద సన్నివేశాలను అక్కడ ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. రూ.8 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు టాక్.

మరోవైపు ఈ చిత్రంలోని బాలకృష్ణ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టిన రోజు(జూన్ 10) కానుకగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాయిబాబు, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus