టాలీవుడ్ ప్రభంజనం….నందమూరి నట సింహం బాలయ్య ప్రతిష్టాత్మక 100వ చిత్రం శాతకర్ణి సాధించిన విజయం టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేనిది….అయితే అదే క్రమంలో ఈ సినిమాతో బడా సినిమాలు పోటీ పడినప్పటికీ వెనుకడుగు వెయ్యకుండా దుమ్ము దులిపింది బాలయ్య శతచిత్రం…ఇదిలా ఉంటే ఇప్పటివరకూ బాలయ్య కరియర్ లో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ ఈ సినిమా చాలా స్పెషల్ అనే చెప్పాలి…ఎందుకంటే…..లెజెండ్. సూపర్ హిట్ టాక్ తో మొదలైన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.40 కోట్ల దాకా వసూలు చేసింది. శాటిలైట్ ఇతరత్రా రైట్స్ అన్నీ కలుపుకుంటే ఆ సినిమా రూ.50 కోట్ల దాకా తెచ్చిపెట్టింది. అంటే బాలయ్య బాక్స్ ఆఫీస్ స్టామినా….50కోట్లు అన్న మాట…అయితే అనుకోకుండా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని క్రిష్ రూ.70 కోట్ల బడ్జెట్లో తీయబోతున్నాడన్న ప్రకటన వినగానే అందరూ షాక్ అయ్యారు…అంతేకాదు…క్రిష్ పని అయిపోయింది అని అన్న సంధర్భాలు కూడా ఉన్నాయి…అయితే ఆ కధలన్నీ పక్కన పెడితే…ఇప్పుడు శాతకర్ణి క్లోసింగ్ లో రికవర్ చేసిన మొత్తం ఎంతో తెలిస్తే క్రిష్ సాహసానికి అందరూ అభినందిస్తారు.
విషయంలోకి వెళితే…..సినిమా బడ్జెట్ .కోట్లు అన్నారు కానీ….సినిమాను దాదాపుగా 55 కోట్లలో ఫినిష్ చేసినట్లు సమాచారం…అయితే అదే క్రమంలో ఈ సినిమా సాధించిన వసూళ్లు విషయం చూస్తే….థియేట్రికల్ కలెక్షన్లతో పాటు డిజిటల్ రైట్స్.. శాటిలైట్.. ఆడియో.. డీవీడీ.. డిజిటల్.. ఇతరత్రా హక్కులన్నీ కలిపితే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రూ.77 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం…అంటే దాదాపుగా ఈ సినిమాతో నిర్మాతలు 20+ కోట్లు లాభాలు పొందారన్న మాట….ఫేక్ రికార్డ్స్, ఫేక్ కలెక్షన్స్ ను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ…..పబ్బం గడుపుకునే వళ్ళున్న ఈ కాలంలో…..ఇలా సినిమా మొత్తం వసూళ్లని ప్రతిష్టాత్మకంగా బయటపెట్టడం మెచ్చుకోదగిన విషయం అనే చెప్పాలి…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.