Gautham, Namrata: హీరోగా రాబోతున్న గౌతమ్ అందుకే న్యూయార్క్ వెళ్ళారా?

మహేష్ బాబు వారసుడు గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు గౌతమ్ ఇప్పటికే మహేష్ బాబు నటించిన ఒక సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా తర్వాత ఈయన పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన చదువుపై శ్రద్ధ పెట్టారు. అయితే ఇటీవల ఉన్నత చదువుల కోసం గౌతమ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇలా గౌతమ్ న్యూయార్క్ వెళ్ళిన సమయంలో నమ్రత తన కుమారుడి గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన కుమారుడి చిన్నప్పటి ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా గౌతమ్ ఒక పేపర్ పట్టుకొని ఉన్నాడు. ఆ పేపర్ లో.. నేను పెద్దయ్యాక ఇండియాలో & అమెరికాలో యాక్టర్ అవుతాను అని రాసుంది. ఈ ఫోటోని నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పలక మీద రాయడం దగ్గర్నుంచి స్క్రిప్ట్స్ రాయడం వరకు నీ కలలు, సంకల్పంతో అనుకున్నది సాధిస్తావు.

నువ్వు నీ కోసం చేసుకున్న ఈ ప్రయాణంలో నీకు ఆనందం, విజయాలు మాత్రమే దక్కాలని కోరుకుంటున్నాను. లవ్ యు సో మచ్ అంటూ రాసుకువచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నమ్రత పోస్ట్ బట్టి చూస్తుంటే తప్పకుండా గౌతమ్ (Gautham) న్యూయార్క్ యూనివర్సిటీలో ఫిలిం యాక్టింగ్ కోర్సు చేయడం కోసం వెళ్లారని

ఈ కోర్స్ పూర్తి కాగానే ఈయన తిరిగి ఇండియా వచ్చే సినిమాలలోకి ఎంట్రీ ఇస్తారు అంటూ కొందరు భావిస్తున్నారు. ఇలా మహేష్ బాబు వారసుడు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి మరి ఎంతో సమయం లేదని ఈ పోస్ట్ పెట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఇలా ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus