ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’
- August 11, 2026 / 05:53 PM ISTByPhani Kumar
రఘు కుంచే ప్రధాన పాత్రలో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ క్రైమ్ డ్రామా ‘ గేదెల రాజు’. ఈ సినిమాకి సంగీత దర్శకుడు కూడా రఘు కుంచె. ఇటీవల ఓటీటీలో అంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో, ఆహాలో డిజిటల్ రిలీజ్ అయ్యింది ఈ చిత్రం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధికంగా రీ-వాచ్ అవుతున్న చిత్రాల్లో ఒకటిగా కొనసాగుతుండగా, ఆహాలో కూడా ట్రెండింగ్‌లో నిలిచింది.
మోటూరి క్రియేషన్స్ బ్యానర్‌పై రఘు కుంచే సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. ఆయన నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
‘గేదెలరాజు’గా రఘు కుంచే నటన, ఆయన అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వికాస్, టీనా శ్రావ్య, రామచంద్రం, మోనికా కలపాల, రవి చిన్నిబిల్లి, శ్రీకాంత్ అయ్యంగార్, బాషా , దివ్య మోటూరి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
హిట్ కథ వదులుకుని డిజాస్టర్ సినిమా చేసిన విజయ్ దేవరకొండ
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















