Vijay Deverakonda: హిట్ కథ వదులుకుని డిజాస్టర్ సినిమా చేసిన విజయ్ దేవరకొండ
- August 11, 2026 / 05:48 PM ISTByFilmy Focus Desk
రెండు సినిమాల కథలు ఒకేసారి దగ్గరకు వచ్చినప్పుడు.. ఒక సినిమాను వదులుకోవడం.. మరో సినిమాను ఓకే చేయడం అనేది సహజం. అయితే వదులుకున్న సినిమాకు మంచి ఫలితం వచ్చి, అట్టిపెట్టుకున్న సినిమాను ఇబ్బందికర ఫలితం వస్తే చాలా బాధగా ఉంటుంది. ఓకే చేసుకున్న సినిమాకు చాలా కష్టపడి, కెరీర్ బెస్ట్ అవుతుంది అనే అంచనాలతో రిలీజ్ చేశాక.. ‘ఎందుకు ఈ సినిమా చేశార్రా బాబూ అని ఆ హీరో ఫ్యాన్స్ అనుకుంటే’ ఇంకా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు విజయ్ దేవరకొండ.
Vijay Deverakonda
దానికి కారణం లోకేశ్ కనగరాజ్ హీరోగా అరంగేట్రం చేసిన ‘డిసి’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలై కోలీవుడ్ బాక్సాఫీసు దగ్గర మంచి పేరు తెచ్చుకుంది. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను సంపాదించుకుని అదే ఫ్లోలో కొనసాగుతోంది. ఈ క్రమంఓ విజయ్ దేవరకొండకి సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో తానెందుకు ‘డిసి’ వదులుకున్నాడో చెప్పాడు విజయ్.

అరుణ్ మాథేశ్వరన్ నాకో కథ చెప్పారు. కథ నచ్చినా ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలాగే ఉండడంతో ఆ ప్రాజెక్టు చేయలేదు విజయ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. విజయ్ మాటలను ‘డిసి’ సినిమాతో లింక్ చేస్తున్నారు నెటిజన్లు. హిట్ సినిమాను వదులుకుని డిజాస్టర్ సినిమా ఓకే చేశావా విజయ్ అంటున్నారు. ఇక విజయ్ చేతిలో ఉన్న సినిమాల సంగతి చూస్తే.. విజయ్ ఇప్పుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ‘రణబాలి’ అనే సినిమా చేస్తున్నాడు. సెప్టెంబర్ 11న రావాల్సిన సినిమా వాయిదా పడే పరిస్థితులు వచ్చాయి.
ఆ సినిమా హీరోయిన్ రష్మిక మందన ఇటీవల గాయపడి.. ప్రస్తుతం రీహాబ్‌లో ఉంది. మరో రెండు నెలలు సినిమా షూటింగ్‌కి రాదు. కాబట్టి కొత్త డేట్ చూడాల్సిందే. ఇది కాకుండా రవి కిరణ్ కొల దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన’ సినిమా కూడా విజయ్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్‌తో విజయ్ ఓ సినిమా చేయాల్సి ఉంది.















