Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

  • May 13, 2026 / 11:59 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

ఇప్పటి రోజుల్లో ప్రేమకథా చిత్రాలంటే.. ‘నువ్వు నచ్చావు, నేను నచ్చానా? అవును అంటే అన్నిటికీపచ్చ జెండా ఊపినట్టే!’ అన్నట్లు ఉంటున్నాయి. కానీ కొంచెం టైంలైన్లో వెనక్కి వెళితే… హృదయాన్ని తాకే ఎన్నో ప్రేమకథా సినిమాలు వచ్చాయి.

Geetanjali

అందులో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించాయి.. క్లాసిక్స్ గా కూడా నిలిచాయి. అలాంటి సినిమాల్లో ‘గీతాంజలి'(Geetanjali) ఒకటి. 1989లో తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తీసిన సినిమా ఇది.

మన అక్కినేని నాగార్జునను హీరోగా పెట్టి ఒక విచిత్రమైన కథతో ఈ లవ్ స్టోరీ తీశాడు. అది ట్రెండ్ సెట్టర్, క్లాసిక్ గా నిలిచింది అని చెప్పాలి.నేటితో 37 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ‘గీతాంజలి’ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం :

ఈ సినిమా కథ చాలా సింపుల్ గా ఉంటుంది. హీరోకి ప్రాణాంతకమైన క్యాన్సర్, హీరోయిన్‌కి హార్ట్ ప్రాబ్లం. ఇద్దరూ ఎప్పుడు చచ్చిపోతారో తెలీదు. కానీ వీళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుంది.? అనే లైన్ తో ఈ సినిమా కథనం ఉంటుంది.ప్రేమికులు చనిపోయినా ప్రేమకి చావు లేదు ‘ప్రేమ ఎప్పటికీ అమరం’ అని తెలపడమే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సినిమాని ఆధారం చేసుకుని తర్వాత చాలా సినిమాలు వచ్చాయి అనుకోండి. అది వేరే సంగతి. కానీ ఏ ఒక్కటీ కూడా ‘గీతాంజలి’ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయింది అనేది వాస్తవం.

అప్పటివరకు డ్యూయెట్ల చిత్రీకరణ కోసమే ఊటీకి వెళ్లేవారు తెలుగు ఫిలిం మేకర్స్. కానీ దర్శకుడు మణిరత్నం ‘గీతాంజలి’ సినిమా మొత్తాన్ని ఊటీలోనే చుట్టేశారు. పొగమంచులో హీరో హీరోయిన్లు కనిపించడం.. వారి మధ్య లవ్ ట్రాక్ నడపడం అనేది అప్పట్లో ఆడియన్స్ కి కొత్త ఫీల్ ఇచ్చింది.

పి.సి. శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ కూడా ఓ మ్యాజికల్ ఫీల్ ఇస్తుంది. ప్రతి సన్నివేశాన్ని ఒక పెయింటింగ్‌లా మలచి మన ముందు ఉంచిన అందమైన అనుభూతి కలుగుతుంది. ఓ కామెడీ ఏంటంటే.. ‘గీతాంజలి’ చూశాక చాలా మంది ప్రేమికులు ఊటీని లవర్స్ స్పాట్ గా చేసుకున్నారు. వాళ్లకి గీతాంజలి రేంజ్ ఫీలింగ్ వచ్చిందో లేదో కానీ జలుబులు, దగ్గులు మాత్రం తెచ్చుకున్నారనేది బహిరంగ రహస్యం!

‘గీతాంజలి’ సినిమాకి మరో పెద్ద బలమంటే ఇళయరాజా గారి సంగీతం అనే చెప్పాలి. ‘ఓ పాపా లాలి’ పాట ఇప్పటికీ చాలా ఇళ్లల్లో వినిపిస్తూనే ఉంటుంది.నిద్రపోని పసిపిల్లలకి ఈ పాట పాడి వినిపిస్తుంటారు. ఫెయిల్యూర్ లవర్స్‌కి ‘ఓ ప్రియా ప్రియా’ అనే పాట జాతీయ గీతం లాంటిది అని చెప్పాలి. ఆ పాట ఒక్కసారి వింటే లూప్లో వింటూనే ఉంటారు.

‘గీతాంజలి’ కి ఓ సీన్ విషయంలో సెన్సార్ వారి నుండి ఇబ్బంది ఎదురైంది అంటే ఎంతమంది నమ్ముతారో చెప్పలేం. ఏంటి.. ఆ రోజుల్లో కూడా సెన్సార్ సమస్యలా అనుకుంటారేమో. కానీ ఇప్పుడు చెప్పబోయేది నిజం. ‘గీతాంజలి’కి నిజంగానే సెన్సార్ వారి నుండి ఓ ఇబ్బంది ఎదురైంది. అది కూడా కిస్ సీన్ కోసం.క్లైమాక్స్‌లో వచ్చే ఆ ముద్దు సీన్ చూసి సెన్సార్ వాళ్ళు షాక్ అయ్యారు. ‘తెలుగు సినిమాలో ఇంత సహజంగా ముద్దు సీన్ పెట్టుకోవచ్చా?’ అని నోళ్లెళ్లబెట్టారట. కానీ అందులో అశ్లీలత లేదు ఎమోషన్ ఎక్కువ ఉండటంతో మేకర్స్ కన్విన్స్ చేసి ఓకే చేయించుకున్నారు. ఆ ఒక్క సీన్‌తో నాగార్జునకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన అదే.. గీతాంజలి పాత్ర పోషించిన హీరోయిన్ గిరిజ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈమె పాత్రకి సీనియర్ నటి రోహిణి గారు డబ్బింగ్ చెప్పారు అనే విషయం చాలా మందికి తెలీకపోవచ్చు. అయితే ‘గీతాంజలి’ తర్వాత గిరిజ తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయకపోవడం గమనార్హం.

ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో ‘గీతాంజలి’ చెల్లెలి పాత్ర కోసం సీనియర్ స్టార్ హీరోయిన్ ని అనుకున్నారు. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ అనమాట. లుక్ టెస్ట్ కూడా చేశారట. కానీ ఆ టైమ్లో ఆమెకి ఎగ్జామ్స్ సీజన్ కావడంతో ‘గీతాంజలి’ ని ఆమె మిస్ చేసుకున్నారు అని చెప్పాలి.

 ‘గీతాంజలి’ చిత్రాన్ని కేవలం రూ. ₹1.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు అనే విషయం చాలా మందికి తెలిసుండదు. రిలీజ్ అయ్యాక ఈ సినిమా నిర్మాతలకి రెండింతల లాభం తెచ్చిపెట్టింది. అప్పట్లో రిస్క్ అనుకున్న కథను, రికార్డుల వేటగా మార్చేశాడు మణిరత్నం. కేవలం కంటెంట్ ను నమ్ముకుని బాక్సాఫీస్ వద్ద ఆయన క్రియేట్ చేసిన అద్భుతాల్లో ‘గీతాంజలి’ ఒకటని చెప్పాలి.’గీతాంజలి’ సినిమా కోసం అక్కినేని నాగార్జునకి ఆ రోజుల్లో రూ.7.5 లక్షలు పారితోషికంగా ఇచ్చారట. దర్శకుడు మణిరత్నం పారితోషికం రూ.10 లక్షలు అని సమాచారం.

వాస్తవానికి ‘గీతాంజలి’ సినిమాని మొదట తమిళంలో తీద్దామని అనుకున్నారట మణిరత్నం. కానీ నాగార్జున పట్టుబట్టి తెలుగులో చేయించారు. తర్వాత తమిళంలో కూడా డబ్ చేసుకోమని చెప్పారట. దీని వల్ల మణిరత్నం సినిమాలకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది.

‘గీతాంజలి’ తర్వాత మణిరత్నం ఇప్పటివరకు తెలుగులో ఒక్క స్ట్రైట్ మూవీ కూడా చేయలేదు అంటే నమ్ముతారా? నమ్మకపోయినా ఇది నిజం.

ప్రేమలో విరహం కంటే, ఉన్న కొన్ని రోజులు ఎంత సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యం అని చాటి చెప్పిన ఓ మాస్టర్ పీస్..గా ‘గీతాంజలి’ గురించి చెప్పుకోవచ్చు.

ఒకవేళ రీ- రిలీజ్ అయితే కనుక ‘గీతాంజలి’ అనే బ్యూటిఫుల్ పెయింటింగ్ ని మిస్ కాకుండా చూడండి..!

ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #37 years of geetanjali
  • #mani rathnam
  • #Manirathnam
  • #nagarjuna

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 hour ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

4 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version