Geetu Royal: లైవ్ లో ఏడ్చేసిన గీతూ రాయల్.. వీడియో వైరల్..!

గీతూ రాయల్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘బిగ్‌బాస్‌’ రియాలిటీ షో గురించి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్స్ గురించి రివ్యూలు ఇస్తూ ఈమె బాగా పాపులర్ అయ్యింది. అలా దక్కిన పాపులారిటీతో త్వరలో ప్రారంభమయ్యే ‘బిగ్‌బాస్‌ 6’లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఇటీవల ఈమె లైవ్ లో కంటతడి పెట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.ఇందుకు ప్రధాన కారణం నెటిజన్లు.. బాడీ షేమింగ్‌ చేస్తూ ఉండడమే అని ఈమె వివరించింది.

‘చిన్నప్పటి నుండి నా శరీరాకృతి గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారు.ఇంట్లో వాళ్లతో పాటు బయట జనాలు చాలా మంది బాడీ షేమింగ్‌ చేశారు. దీంతో నా బాడీని చాలా వరకు కవర్‌ చేసేలా డ్రెస్సులు వేసుకుంటూ వచ్చాను.ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కొంతమంది నా బూ*స్ గురించి కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల నా కజిన్స్‌, ఫ్రెండ్స్‌ ను కొంతమందిని కలిసాను..అప్పుడు వాళ్ళు నువ్వు ముందు నీ బాడీని ప్రేమించమని అన్నారు. కానీ, నేనేమో పిచ్చిదానిలా ఏడుస్తున్నాను. జనాలు మీ బాడీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి.

మనుషుల శరీరాకృతిని బట్టి వారు క్యారెక్టర్ ను డిసైడ్ చేస్తారనుకుంట. బాడీ షేమింగ్ చేసే వారిని కూడా నేను కోరుకుంటుంది ఒక్కటే… దయచేసి బాడీ షేమింగ్‌ చేయకండి’ అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో కొంతమంది ‘బిగ్ బాస్5’ కంటెస్టెంట్ అయిన షన్ను ని నువ్వు బాడీ షేమింగ్ చేయలేదా అంటూ ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘బిగ్‌బాస్‌ గేమ్‌ జడ్జ్‌ చేయడం వరకే నా పని. మా వాడిని అన్నప్పుడు లేదా? అని తిడుతున్నారు. ఆయన బయటకు వచ్చినప్పుడు నేను అతని పేరు కూడా ఎత్తలేదు.

ఎందుకంటే బిగ్‌బాస్‌ తర్వాత ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి.! నేనేదో కావాలని సింపతీ క్రియేట్‌ చేస్తున్నానంటున్నారు. నాకేమీ చేతకాదు అని ఒప్పుకున్నప్పుడు సింపతీ క్రియేట్‌ చేస్తా. ఇప్పుడు నాకు చాలా ట్యాలెంట్ ఉందని నేను నమ్ముతున్నాను. నాకు సింపతీ అక్కర్లేదు. పాత రివ్యూలను, పాత విషయాలను అలాగే పట్టుకుని వేలాడేవాళ్ళను నిబ్బాస్‌ అంటుంటారు. కొంచెం మారండి.నేను నిజంగా ఎవరినైనా బాడీ షేమింగ్‌ చేసుంటే ఆ వీడియో పంపించండి. ఒకవేళ అది నిజమైతే బహిరంగంగా క్షమాపణలు చెబుతాను’ అంటూ వేడుకుంది గీతూ రాయల్.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus