సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న బొమ్మరిల్లు హాసిని!

హీరోయిన్స్ గా అనేక విజయాలు అందుకున్న తారలు పెళ్లి అయిన తర్వాత నటనకు కొంతకాలం బ్రేక్ ఇచ్చినప్పటికీ.. మళ్ళీ మంచి కథలతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు, తమిళ సినిమాలో హిట్స్ అందుకున్న జ్యోతిక సూర్యను పెళ్లాడిన తర్వాత.. ఇప్పుడు లేడి ఓరియెంటెడ్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. అదే విధంగా బొమ్మరిల్లు హాసిని గా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ అల్లరి పిల్ల .. ఇప్పుడు తల్లి అయింది. తన తొలి సినిమా హీరో రితేష్ దేశముఖ్‌ను పెళ్లాడి సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మళ్ళీ వెండితెరపైకి రావడానికి ఏర్పాట్లు చేస్తోంది. అయితే బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమలో కాకుండా మరాఠీ చిత్రం ద్వారా మళ్ళీ అడుగుపెడుతోంది.

లేడీ ఓరియెంటెడ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినెమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ విషయాన్నీ స్వయంగా జెనీలియా వెల్లడించింది. ముంబై లో ఓ కార్యక్రమానికి హాజరైన జెనీలియా మాట్లాడుతూ” నన్ను మరాఠీ కథ చాలా బాగా ఆకర్షించింది. రీ ఎంట్రీ ఇస్తే అదే కథతోనే ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. త్వరలోనే నిర్మాతలు సినిమా గురించి వెల్లడిస్తారు” అని స్పష్టం చేసింది. ఈ విషయం తెలిసి టాలీవుడ్, కోలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా జెనీలియాకు సూటయ్యే లేడీ ఓరియెంటెడ్ కథలను రెడీ చేయడానికి రంగంలోకి దిగారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus