‘జార్జ్ రెడ్డి’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

సందీప్ మాధవ్ హీరోగా జీవన్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘జార్జ్ రెడ్డి’. సత్యదేవ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ‘మైక్ మూవీస్’ ‘సిల్లీ మాంక్స్ స్టూడియోస్’ ‘త్రీ లైన్ సినిమాస్’ నిర్మాణ సంస్థల పై అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 22 న (నిన్న) విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను మూట కట్టుకుంది. అయితే ముందు నుండీ ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఉండడంతో డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం పెర్ఫార్మన్స్ బాగుంది.

నైజాం 0.26 cr
సీడెడ్ 0.07 cr
ఉత్తరాంధ్ర 0.10 cr
ఈస్ట్ 0.04 cr
వెస్ట్ 0.03 cr
కృష్ణా 0.04 cr
గుంటూరు 0.04 cr
నెల్లూరు 0.02 cr
ఏపీ + తెలంగాణ 0.61 cr(share)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.04 cr
ఓవర్సీస్ 0.08 cr
టోటల్ వరల్డ్ వైడ్ 0.73 cr (share)

‘జార్జ్ రెడ్డి’ చిత్రానికి 3 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. మరో 2.27 కోట్ల షేర్ వరకూ రాబట్టాల్సి ఉంది. వీకెండ్ వరకూ ఈ చిత్రం మంచి కల్లెక్షన్లనే రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు. మరి వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్లను రాబడితే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్! 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus