పెన్ను కసిగా రాస్తే, కెమెరా రెచ్చిపోయి నటిస్తే అదే ఐరావతం.

  • May 8, 2022 / 11:28 AM IST

థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. కొంచెం కమర్షియల్ టచ్ కూడా ఇస్తే యూత్ ని కూడా ఆకర్షించొచ్చు. ఎంగేజింగ్ కథాకథనాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. నిర్మాతలు, దర్శకులు కూడా ఇలాంటి స్టోరీస్ నే ఎంచుకుని ప్రేక్షకులను థియేర్లకు రప్పిస్తున్నారు. తాజాగా విడుదలైన ఐరావతం మూవీ కూడా… ఇలాంటి క్రైం థ్రిల్లర్ తో రూపొంది అందరినీ ఆకట్టుకుంటుంది.

శ్లోక (తన్వీ నేగి) ఓ బ్యూటీషియన్. ఆమెకు చిక్కు (అమర్ దీప్ చౌదరి) బాయ్ ఫ్రెండ్. శ్లోకకి పుట్టినరోజు కానుకగా ఓ వైట్ కెమెరాను బహుమతిగా ఇస్తాడు.  ఆ కెమెరా ప్రత్యేకత ఏమిటి అంటే… శ్లోక తన వీడియో తీసుకుంటే… తనను పోలిన మరో అమ్మాయి ప్రిన్సీ అనే అమ్మాయి వీడియో ప్లే అవుతుంది. ఇలా ప్లే అయిన ప్రతి సారి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ క్రైం థ్రిల్లర్ స్టోరీ ప్లే అవుతుంది. ఆ కెమెరా ప్రత్యేకత గురించి, ప్రిన్సీ గురించి.. మాయా (ఏస్తర్) శ్లోకకి చెబుతుంది.  అలా కెమెరా వల్ల శ్లోక, ప్రిన్సీ మంచి స్నేహితులు అవుతారు. ప్రిన్సీ మోడల్ గా పనిచేస్తూ వుంటుంది. ఆమెకు సన్నీ అనే బాయ్ ఫ్రెండ్ వుంటాడు. అతను మంచి ఫ్యాషన్ ఫొటో గ్రాఫర్. అయితే శ్లోక, ప్రిన్సీలలో ఎవరో ఒకరు చనిపోవడం ఖాయం ఆని కూడా మాయా (ఎస్తర్) చెబుతుంది. మరోవైపు సీరియల్ మర్దర్లతో పోలీసులకు ఓ సవాల్ గా మారి వుంటాడు ఓ సైకో కిల్లర్. అసలు ఆ తెల్ల కెమెరా అసలు కథ ఏంటి? శ్లోక, ప్రిన్సీ లలో ఎవరు చనిపోయారు? వాళ్ళని చంపాల్సిన అవసరం ఎవరికుంది? సైకో కిల్లర్ ఎవరు? అనే కథతో ఈ చిత్రం రూపొందింది.

సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీస్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారనడంలో సందేహం లేదు. ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది. సస్పెన్స్, ట్విస్టులతో అలరిస్తుంది. ఓ వైపు స్టోరీ నెరేషన్ సగటు ప్రేక్షకుడికి కొంత కన్ఫ్యూషన్ కలిగించినా.. చివరకు క్లైమాక్స్ లో ఓ క్లారిటీ వస్తుంది. అక్రమ సంబంధాలతో నిర్లక్ష్యానికి గురైన ఓ అబ్బాయి… చివరకు ఎలా మారాడు అనేది చూపించి మెసేజ్ కూడా ఇచ్చాడు. తాను బాగా ఇష్టపడే అమ్మాయి ఇతరులతో చనువుగా వుండటం భరించలేక… ఎలా హంతకునిగా మారినాడు అనేది ఎంతో థ్రిల్లింగ్ గా చూపించాడు దర్శకుడు. ఐరావతం ఓ మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్. ఇలాంటి జోనర్స్ ఇష్టపడే వారు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు అని విమర్శకులు చెబుతున్నారు.  అమర్ దీప్ చౌదరి ఇప్పటికే సీరియల్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ వుంది. అందుకే ఈ సినిమాని మంచి ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ అండ్ కంటెంట్ తో పబ్లిసటీ పీక్స్ కి తీసుకెళ్లాడు. చిక్కు పాత్రలో పక్కింటి అబ్బాయిలా నటించి మెప్పించారు. హీరోయిన్ ద్విపాత్రాభినయంలో బాగా గుర్తుండి పోయే పాత్రను పోషించింది. ఓ వైపు బ్యుటీషియన్ గా… మరోవైపు మోడల్ గా మోడ్రన్ పాత్రను పోషించి మంచి మార్కులే కొట్టేసింది.  అరుణ్ జాను పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగుంది. అతనికి జోడీగా నటించిన ఎస్తర్ మాయగా మరోవైపు వేద పాత్రలో చాలా డీసెంట్ పాత్ర పోషించి ఆకట్టుకుంది. చివర్లో చర్చి ఫాదర్ క్యారెక్టర్ లో సప్తగిరి కనిపించి ప్రేక్షకులను కాసేపు నవ్వించారు. మిగతా పాత్రన్నీ తమ తమ పరిధిలో నటించి తమ పాత్రలకు న్యాయం చేశారు.డైరెక్టర్ సుహాస్ ఎంచుకున్న కథ, కథనాలు మంచి డ్రైవింగ్ పాయింట్స్. ఆద్యంతం ట్విస్టులతో స్క్రీన్ ప్లేని నడిపిన తీరు ఆకట్టుకుంటుందని ప్రేక్షకులు చెబుతున్నారు. పెద్దగా ప్యాడింగ్ కి ప్రాధాన్యత ఇవ్వకపోయినా.. కథ కథనాలను నమ్ముకుని ఎక్కడా బోరింగ్ కొట్టని ఎలిమెంట్స్ తో డైరెక్టర్ తెరకెక్కించిన తీరుకి ప్రశంసలు దక్కుతున్నాయి. సత్య కశ్యప్ సాంగ్స్, కార్తీక్ కడగండ్ల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి . ఆర్.కె.వల్లెపు సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఆర్టిస్టుల ను చాలా అందంగా చూపించారు. విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ క్రిస్పీ గా సాగుతుంది. ఎడిటర్ సురేష్ దుర్గం సీన్స్ ని… ఏర్చి కూర్చడంలో తన ప్రతిభను చూపించాడు. నిర్మాతలు రాంకీ పలగని, లలిత కుమారి, బాలయ్య చౌదరి సినిమాను మంచి అత్యుత్తమ నిర్మాణ విలువలతో నిర్మించారు. ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు.. అంటూ ప్రేక్షకుల నుండీ మంచి ఆదరణని రాబట్టుకుంటుంది ‘ఐరావతం’.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus