‘బిగ్ బాస్’ పై గెటప్ శ్రీను కామెంట్స్..!

గెటప్ శ్రీను… పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర జబర్దస్త్ షో లో ఈయన చేసే రచ్చ అంతా ఇంతా కాదు. డిఫెరెంట్.. డిఫెరెంట్.. గెటప్ లు వేస్తూ కడుపు చెక్కలైపోయేలా నవ్విస్తుంటాడు. ‘బిల్డప్ బాబాయ్’ పాత్ర సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రోలింగ్ కు ఈ వీడియో ని తెగ వాడుకుంటుంటారు నెటిజన్లు. ఇక తాజాగా గెటప్ శ్రీను తన సోషల్ మీడియాలో కాసేపు అభిమానులతో ముచ్చటించాడు. ఈ క్రమంలో ‘బిగ్ బాస్’, అలాగే సుధీర్ పెళ్ళి పై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘ ‘బిగ్ బాస్’ షోపై మీ అభిప్రాయమేంటి? అనే ప్రశ్నకి గెటప్ శ్రీను బదులిస్తూ.. “షో ప్రేక్షకులను బాగా అలరిస్తుందని.. మొదట్లో నన్ను కూడా ఈ షో కోసం సంప్రదించారు. కానీ అందులో ఉండిపోతే వేరే షోలు చేయడానికి ఉండదు. అందుకే ‘బిగ్ బాస్’ కు వెళ్ళలేదు. ఒకవేళ ఒప్పుకున్నా.. మొదటివారంలోనే బయటకి వచ్చేస్తాను”… అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు.

‘ ‘జబర్దస్త్’ షోకి లీడర్ గా ఎందుకు చేయడం లేదు?’ అని మరో నెటిజెన్ ప్రశ్నించగా… ” ‘జబర్దస్త్’, ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ షోలను ఒకరోజు గ్యాప్ తో షూట్ చేస్తారు. అప్పట్లో ‘జబర్దస్త్’ టీమ్ లీడర్ గా ఉండడంతో.. ఆ తరువాత రోజు జరిగే ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ లో నటించడం కష్టమయ్యేది. నాలుగు కంటెంట్ లు ఆలోచిస్తే.. రామ్ ప్రసాద్ స్క్రిప్ట్ రాయడం, ఇద్దరం నటించడం చేయాలి.. క్వాలిటీ కంటెంట్ వచ్చేది కాదు. దీంతో టీమ్ లీడర్ గా చేయను.” అంటూ జవాబిచ్చాడు శ్రీను.

‘సుధీర్, రష్మి మ్యారేజ్ ఎప్పుడు? అని మరో నెటిజెన్ ప్రశ్నించగా.. “వారిద్దరూ పెళ్ళి చేసుకోరు. ఇద్దరివీ వేర్వేరు జీవితాలు. షూటింగ్ అయిపోగానే ఎవరి లోకం వాళ్ళది. ప్రేక్షకులను అలరించడానికి ఒక కాంబినేషన్.. అలా చూపిస్తారు.. అంతే కానీ అది నిజం కాదు. సుధీర్ కి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. త్వరలోనే పెళ్ళి చేసుకుంటాడు. అంటూ జవాబిచ్చాడు.

ఇక ఈ శుక్రవారం ‘రాజు గారి గది 3’ సినిమా విడుదలవుతుంది. అందులో నా పాత్ర కూడా ఉంటుంది. ‘జబర్దస్త్’ షోలో బాగా ఫేమస్ అయిన బిల్డప్ బాబాయ్ పాత్ర ‘రాజుగారి గది3’ లో ఉంటుంది… అంటూ చెప్పుకొచ్చాడు గెటప్ శ్రీను..!

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus