Ghajini 2: గజని 2: ఈ బ్యాడ్ టైమ్ లో సాధ్యమేనా?

సూర్య (Suriya) కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమాల్లో గజిని ఎప్పటికీ ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. 2005లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులని మాత్రమే కాకుండా, టాలీవుడ్ మార్కెట్‌ను కూడా ప్రభావితం చేసింది. దీంతో దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌కి (A.R. Murugadoss) బిగ్ లెవెల్ ప్రాజెక్ట్‌లు రావటమే కాకుండా, అమీర్ ఖాన్ (Aamir Khan) కూడా దీనిని హిందీలో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు, ఇరవై ఏళ్ల తర్వాత గజిని 2 పై నిర్మాత మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.

Ghajini 2

ఈ మధ్య ముంబైలో తండేల్ (Thandel)  ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ ‘గజిని 2’ గురించి హింట్ ఇచ్చారు. తన కోరికగా మాత్రమే అన్నారో, లేక నిజంగా ఈ ప్రాజెక్ట్ పై ప్లానింగ్ ఉందో తెలియదు, కానీ ఫ్యాన్స్ మాత్రం వెంటనే హైప్ క్రియేట్ చేసేశారు. హిందీలోనూ అమీర్ ఖాన్ మళ్లీ ఈ ప్రాజెక్ట్‌లో ఉంటారా? లేదా కోలీవుడ్ వెర్షన్‌ను ప్లాన్ చేస్తున్నారా? అనే ప్రశ్నలు వెంటనే రైజ్ అయ్యాయి. అయితే, ఇది సాధ్యమా? అనే డౌట్ కూడా ఉంది.

ఇప్పటి మార్కెట్ ట్రెండ్ చూస్తే, సీక్వెల్స్ తక్కువ గ్యాప్‌లో రాకపోతే పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఉదాహరణకు బాహుబలి (Baahubali), కెజిఎఫ్(KGF),, పుష్ప (Pushpa 2: The Rule) లాంటి సినిమాలు ఫస్ట్ పార్ట్ సక్సెస్ అవగానే వెంటనే రెండో భాగాన్ని ప్లాన్ చేశాయి. కానీ ఇక్కడ 20 ఏళ్ల గ్యాప్ ఉంది. ప్రేక్షకుల కొత్త తరహా టేస్ట్‌కు ఇది ఎంతవరకు సరిపోతుందనేది ప్రశ్నార్థకమే. అంతేకాదు, మురుగదాస్ ఇటీవల సినిమాల్లో తన మేజిక్ మిస్ అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన సల్మాన్ ఖాన్‌తో (Salman Khan) సికందర్ (Sikandar) చేస్తున్నాడు, కానీ సౌత్ హీరోలతో ఆయన హిట్టు కొట్టి చాలా కాలమైంది.

అందుకే, గజిని 2 కంటే కొత్త పాన్ ఇండియా స్క్రిప్ట్‌ను ట్రెండ్‌కి తగ్గట్టుగా తెరకెక్కించడం బెటర్ అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అల్లు అరవింద్ (Allu Aravind) గతంలోనూ పాన్ ఇండియా సినిమాల ప్రొడక్షన్‌లో ముందంజలో ఉన్నారు. గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన హిట్స్ వరుస చూస్తే, ఇది కచ్చితంగా సాధ్యమే. కానీ మురుగదాస్‌తోనే చేయాలా? లేక కొత్త క్రేజీ దర్శకుడితో చేయించాలా? అనే అంశం కీలకం.

అయితే కేవలం హింట్ ఇచ్చిందంత మాత్రాన ఈ ప్రాజెక్ట్ వాస్తవంగా సెట్స్ పైకి వెళుతుందా? అన్నది ప్రశ్నే. కథ సిద్ధమైతేనే ముందుకెళ్లే అవకాశం ఉంది. మురుగదాస్ గతంలో ఇదే ప్రశ్నకు ఐడియా ఉంది, కానీ ఇంకా స్క్రిప్ట్ రాసలేదు అన్నారని తెలుస్తోంది. అంటే ఇప్పటికీ కనీసం స్టోరీ కూడా సిద్ధం కాలేదన్నమాట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus