సబ్ మెరైన్ కథాంశంతో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం ‘ఘాజీ’. దగ్గుబాటి రానా నేవీ ఆఫీసర్ అర్జున్ గా నటించిన ఈ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 17 ) రిలీజ్ అయి భారీ కలక్షన్స్ రాబడుతోంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఫిల్మ్ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3500 స్క్రీన్లలో ప్రదర్శిత మైన ఘాజీ తొలిరోజు 4.25 కోట్లు వసూలు చేసింది. రెండోరోజు (శనివారం) 5.20 కోట్లు రాబట్టింది. అందరినోట బాగుందని సమాధానం వస్తుండడంతో రోజురోజుకి ఈ చిత్రాన్ని చూసే వారి సంఖ్య పెరుగుతోంది.
ఆదివారం 6.10 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మూడురోజుల్లో 15 .55 కోట్లు వసూలు చేసి రానా రేంజ్ ని పెంచింది. సోమా, మంగళ, బుధవారాల్లో ప్రపంచవ్యాప్తంగా మరో 12 కోట్లు రాబట్టింది. దీంతో ఆరు రోజుల టోటల్ గ్రాస్ 27 .55 కు చేరింది. రేపు శివరాత్రి, ఆ తర్వాత శనివారం, ఆదివారం.. ఈ మూడు రోజులు సెలవు దినం కావడంతో కలక్షన్స్ పెరిగే అవకాశముందని, దీంతో అవలీలగా రానా మూవీ త్వరలో 50 కోట్ల క్లబ్ లో చేరుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.