వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్ పై సూరి ఎస్ దర్శకత్వంలో కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా రోహన్, రిదా జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “గప్ చుప్ గణేశా”(Ghup Chup Ganesha). ఈ చిత్రానికి శ్రీ తరుణ్ సంగీతాన్ని అందించగా అంగత్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అంతేకాక ఈ చిత్రంలో అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి తదితరులు కీలకపాత్రలో పోషించారు. వినాయక చవితి సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “ఈ చిత్ర టైటిల్ గప్ చుప్ గణేశా చాలా బాగుంది. ప్రేక్షకులకు చాలా క్యాచీ టైటిల్ ను చిత్ర బృందం అందించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా నా చేత ఫస్ట్ లుక్, టైలర్ లాంచ్ చేయించిన ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను. గతంలో కూడా కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్పై రిచ్చిగాడి పెళ్లి అనే చిత్రం హేమ్రాజ్ దర్శకత్వంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు హేమ్రాజ్ ఈ చిత్రానికి నిర్మాతక వ్యవహరిస్తున్నారు. ఇటువంటి చిన్న సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటూ మరొకసారి ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను” అన్నారు.

చిత్ర నిర్మాత హేమ్రాజ్ మాట్లాడుతూ… “మా చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన ఎంతో బిజీగా ఉన్న మా కోసం ఆయన సమయాన్ని కేటాయించి మా చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చినందుకు థాంక్స్” అన్నారు.

చత్ర దర్శకుడు సూరి ఎస్ మాట్లాడుతూ… “మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఆయన సమయాన్ని కేటాయించి మాకు అండగా నిలబడిన ఛాంబర్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్ గారికి మా చిత్ర బంధం తరఫున ధన్యవాదాలు” అన్నారు.

నటుడు రోహన్ మాట్లాడుతూ… “మమ్మల్ని మా చిత్ర బృందాన్ని సపోర్ట్ చేస్తూ మా చిత్ర ట్రైలర్ లాంచ్ ఇంకా ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రేక్షకులంతా మా చిత్రాన్ని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.

ఇక ఈ చిత్రం ఈ విధంగా ఉంటుందని చిత్ర బృందం తెలిపారు. ఒక మొహమాటస్తుడైన వ్యక్తి తన మొహమాటం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతాడో హాస్యపరంగా చూపిస్తూ ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొనుంది. ఈ కథ హాస్యస్పదంగా, ఆకర్షణీయంగా, ఎంతో ఆహ్లాదంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని సన్నివేశాలు యువతను కట్టిపడేస్తాయని ఈ చిత్ర బృందం తెలిపారు.

అలాగే ఈ చిత్ర ట్రైలర్ విషయానికి వస్తే… ఒక మొహమాటస్తుడైన వ్యక్తి తన మొహమాటంతో తన ఉద్యోగాన్ని అలాగే తన జీవితంలో ఇతర సన్నివేశాలను ఏ విధంగా ఎదుర్కొంటాడు, తన జీవితంలోకి వచ్చిన తనపై అధికారితో ఎలా మెసులుకుంటాడు అనేది తెలుపుతూ ఎంతో ఫన్నీగా ఉంది. అలాగే అతని క్యారటైజేషన్ చూస్తే సహజంగా మనం బయట చూసే ఎంతోమందిని ప్రతిబింబెస్తూ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంది.

ఈ చిత్రం త్వరలో ఒక ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం తెలిపింది.

నటీనటులు : రోహన్, రిదా, అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి తదితరులు.

సాంకేతిక బృందం :
బ్యానర్ : కేఎస్ ఫిలిం వర్క్స్
నిర్మాత : కేఎస్ హేమ్రాజ్
రచన, దర్శకత్వం : సూరి ఎస్
స్క్రీన్ ప్లే : సూరి ఎస్, రోహన్ రమేష్
సినిమాటోగ్రఫీ : అంగత్ కుమార్
సంగీత దర్శకుడు : శ్రీ తరుణ్
ఎడిటర్ : అరుణ్ ఎం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మహేష్ మహేంద్ర, భరత్ పచ్చల
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ : డిజిటల్ దుకాణం

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus