విష్ణు మంచు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘జిన్నా’. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ మూవీని ‘అవా ఎంటర్‌టైన్‌మెంట్’, ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సంయుక్తంగా నిర్మించాయి. ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ వంటి మాస్ చిత్రాన్ని తెరకెక్కించిన ఈషాన్ సూర్య ‘జిన్నా’ కి దర్శకత్వం వహించాడు. అయితే కథ, స్క్రీన్‌ప్లే మాత్రం కోన వెంకట్ అందించడం జరిగింది.పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ ఈ చిత్రంలో హీరోయిన్లు.
దీపావళి కానుకగా అక్టోబర్ 21న ‘జిన్నా’ మూవీ రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీకి రిలీజ్ కు ముందు పెద్దగా బజ్ ఏర్పడలేదు. దీంతో బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదు. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :
నైజాం | 1.32 cr |
సీడెడ్ | 0.74 cr |
ఉత్తరాంధ్ర | 0.58 cr |
ఈస్ట్ | 0.27 cr |
వెస్ట్ | 0.22 cr |
గుంటూరు | 0.32 cr |
కృష్ణా | 0.35 cr |
నెల్లూరు | 0.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.00 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
0.35 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.35 cr (షేర్) |
‘జిన్నా’ చిత్రానికి రూ.4.35 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.6 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇది అంత ఈజీ టార్గెట్ అయితే కాదు. పోటీగా ‘ప్రిన్స్’ ‘ఓరి దేవుడా’ ‘సర్దార్’ వంటి సినిమాలు ఉన్నాయి. అలాగే ‘కాంతారా’ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తూ స్ట్రాంగ్ గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘జిన్నా’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!