సినిమా – హీరోయిన్ – గ్లామర్. ఈ మూడింటి మధ్య పెద్ద అనుబంధమే ఉంది. సినిమాలో హీరోయిన్ లేకుండా ఉండదు. హీరోయిన్ అన్నాక గ్లామర్ షో చేయకుండా ఉండదు. టాలీవుడ్లో ఇప్పటివరకు నటించిన హీరోయిన్లలో 90 శాతం నాయికలు ఈ పని చేసినవాళ్లే. మన అభిమానులకు కూడా ఇదే కావాలి అనుకోండి. అందమైన నాయిక మరింత అందంగా కనిపిస్తే… ఎవరికి నచ్చదు చెప్పండి. తాజాగా ఇద్దరు హీరోయిన్లు ఈ దిశగా గేరు మార్చారు.
టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడమే గ్లామర్ షోతో వచ్చింది పాయల్ రాజ్‌పుత్. అప్పటివరకు కొన్ని హిందీ సీరియల్స్‌లో నటించిన ఈ అందం ‘ఆర్ఎక్స్ 100’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కొత్త అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇక స్టార్ హీరోయిన్ అవ్వడమే ఆలస్యం అనుకున్నారు. అయితే పాయల్ రూట్ మార్చింది. కొన్ని పద్ధతైన పాత్రలు చేసింది. అయితే వాటితో హిట్ రాలేదు. దీంతో ఇప్పుడు తిరిగి గ్లామర్ రూట్లోకి వచ్చింది. ఆది సాయికుమార్ ‘తీస్మార్ఖాన్’తో గ్లామర్ పాయల్‌ను చూడొచ్చు. ఇప్పటికే విడుదలైన రెండు బీచ్ ఫొటోల్లో ఆమె స్కిన్ షో చూసి బాప్రే అంటున్నారు యువత.
ఇప్పుడు గ్లామర్ డాల్‌గా మారిన రెండో హీరోయిన్ గురించి చెప్పాలి. ఆమెనే మెహ్రీన్ కౌర్ పిర్జాదా. మొన్నీ మధ్య రిలేషన్లోకి వెళ్తూ.. మధ్యలో ఆగిపోయింది మెహ్రీన్. ఆ తర్వాత వరుస సినిమాలు ఓకే చేస్తూ వస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లలో మెహ్రీన్ గ్లామర్ ఒలకబోసింది కానీ… మరీ స్కిన్ షో చేసేంతగా కాదు. అయితే ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా ప్రచారంలో కాస్త ఎక్కువ గ్లామరే ఒలకబోస్తోంది. దీంతో ఇలా కూడా దర్శకుల కళ్లలో పడాలని అనుకుంటోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.