Godfather OTT: గాడ్ ఫాదర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసిన నెట్ ఫ్లిక్స్!

మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమాకు రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ దసరా పండుగ సందర్భంగా థియేటర్లో విడుదలై మంచి వసూలు రాబట్టింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత ఈ సినిమా విడుదల కావడంతో అభిమానులు ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలయ్య థియేటర్లో ఎంతో మంచి వసూలు రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా విడుదలై థియేటర్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్త నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాను ఓటీటీలో ఈనెల 19వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నట్లు నెట్ ఫిక్స్ వెల్లడించింది.

థియేటర్లో ఈ సినిమాని మిస్ అయినటువంటి ఎంతోమంది ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో చూడటం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోని ఈ సినిమా నవంబర్ 19వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు రానుందని తెలియడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా థియేటర్లో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

మరి ఈ సినిమా ఓటీటీలో ప్రసారమవుతూ ఎలాంటి ఆదరణ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార సత్యదేవ్ వంటి ప్రముఖ తారాగణం నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నయనతార చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించడం విశేషం.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus