కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly). ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించాయి. ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వం వహించిన ఈ సినిమాని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మించారు. సినిమా ఇప్పటికీ స్టడీగా కలెక్ట్ చేస్తూనే ఉంది.సుల్తానా పాట సినిమా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.
ఇన్స్టా రీల్స్ వంటి వాటి వల్ల ఇది బాగా వైరల్ అవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బాగా కలెక్ట్ చేస్తుంది. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్దగా ఉండటం.. తెలుగులో సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం వల్ల కొంత వెనుకబడింది అని చెప్పాలి. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.62 cr |
సీడెడ్ | 0.71 cr |
ఆంధ్ర | 1.21 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.54 cr |
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.5.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 10 రోజుల్లో ఈ సినిమా రూ.3.54 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.5.91 కోట్లు కలెక్ట్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.96 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.రెండో ఆదివారం గట్టిగా కలెక్ట్ చేయాల్సిన అవసరమైతే ఉంది.