ప్రభాస్ అభిమానులను సంతోషపెట్టే వార్త

ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే అభిమానులకు ఆరోజు పండుగే. అటువంటి రెండు పండుగలను ఈ ఏడాది జరుపుకోనున్నారు. ఎందుకంటే ప్రభాస్ నటించిన సినిమాలు ఈ సంవత్సరం రెండు రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ “రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నేటి నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలయింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ప్రథమార్ధంలో రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం ఫిక్స్ అయింది. అందుకే దుబాయ్ లో అనుమతి రాకపోయేసరికి వెంటనే షూటింగ్ హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు. ఆగస్టు లోపున సాహో రిలీజ్ చేయాలనీ కష్టపడుతున్నారు.

ఈ చిత్రం తర్వాత సినిమాకి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపి కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్లో కృష్ణం రాజు నిర్మించనున్న ఆ సినిమాని జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ సాహో థియేటర్లోకి రాకముందే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. దీనిని కూడా నాలుగు నెలల్లో కంప్లీట్ చేసి డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ కృష్ణం రాజు భావిస్తున్నారు. అనుకున్న ప్రకారం జరిగితే ఈ ఏడాది ప్రభాస్ చిత్రాలు హంగామా చేయనున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus