ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న ‘పాపవినాశనం’

Ad not loaded.

లఘు చిత్రాల ద్వారా ప్రతిభను నిరూపించుకుని స్టార్స్ గా ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు. ఒక చక్కటి సందేశాన్ని షార్ట్ ఫిల్మ్ లో ఇమిడించి అందరిని మెప్పించడం అంటే గొప్ప విషయం. అలాంటి ఒక సందేశాత్మక లఘు చిత్రాన్ని తెరకెక్కించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు దొంగరి మహేందర్ వర్మ. అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఆయన రచించి దర్శకత్వం వహించిన సినిమా పాపవినాశనం. శివాని, జోష్ రవి, జబర్దస్త్ అప్పారావు, సమ్మెట గాంధీ, దంచెనాల శ్రీనివాస్, ప్రియ, శివ, సాయి రెడ్డి ప్రముఖ పాత్రల్లో నటించారు. మాస్టర్ లిఖిత్ & అక్షిత్ సమర్పణలో ఇందిర దొంగరి నిర్మాతగా  వ్యవహరిస్తున్న ఈ సినిమా కి ప్రముఖ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా శ్రవణ్ కుమార్ ఛాయాగ్రహణం, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

తాజాగా ఈ చిత్రం యొక్క ప్రీమియర్ షో హైదరాబాద్ లో ప్రదర్శించారు. కాగా ఈ షో కి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ అల్లం నారాయణ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ  చీఫ్ విప్ శ్రీ బోడకుంటి వెంకటేశ్వర్లు గారు,తెలంగాణ సీఎం పూర్వ పి ఆర్ ఓ శ్రీ గటిక విజయ్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర  సంఘం అధ్యక్షులు శ్రీ మద్దా లింగయ్య ,కోదాడ మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీ నారాయణ ,  కో ఆ సొసైటీ ప్రధాన కార్యదర్శి శ్రీ అంకతి విజయ్ కుమార్, ఆర్థిక కార్యదర్శి శ్రీ సుంకరి ఆనంద్  విద్యార్థి వసతి గృహం గౌ. అధ్యక్షుడు డా. దొంగరి వెంకటేశ్వర్లు గ్రేటర్ హైదరాబాద్  సంఘం అధ్యక్షులు శ్రీ బత్తిని పరమేష్ సినీ నిర్మాత ఆత్మీయులు శ్రీ బెక్కం వేణుగోపాల్,సంఘ నాయకులు శ్రీ దొంగరి శంకర్, సినీ హీరో ఉత్తేజ్ ,డా. దాచేపల్లి సుధీర్ కుమార్ ,మహేందర్ తదితరులు బంధుమిత్రులతో హాజరయ్యారు.

చిత్రం చూసిన అనంతరం అందరూ కూడా చిత్రాన్ని కొనియాడారు. అరగంట లొ  ఒక అద్భుతమైన చిత్రాన్ని చూపించగా త్వరలోనే ఈ చిత్రం ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus